విపక్షాల ఐక్యతా యత్నాలు..ప్రధాని కుర్చీ కోసం కోట్టాటలు!

Publish Date:Apr 25, 2023

Advertisement

జాతీయ రాజకీయాల్లో మార్పుతీసుకుని వచ్చి..వెూడీకి వ్యతిరేకంగా గంట కట్టాలని తెలంగాణ  తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నాలకు ఎవరూ కలిసి రాలేదు. వెూడీని గద్దె దించాలంటే బీజేపీయేతర రాజకీయ  పార్టీల్లో ఐక్యత అవసరం. అయితే  ఆ ఐక్య కూటమికి నాయకత్వం విషయంలో మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీయే నేనే ముందు అంటుండటంతో అడుగులు ముందుకు పడటం లేదు. విపక్షాలలోనిఈ బలహీనతే బలంగా బీజేపీకి బలంగా మారుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ బలహీన పడడంతో  జాతీయ రాజకీయాలలో ఆధిపత్యం కోసం పోటీపడే పార్టీల సంఖ్య పెరిగిపోయింది. పోటీపడటమే కానీ.. సయోధ్య యత్నాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ఎదుటి పార్టీని అడుగు వేయనీయకుండా అడ్డుపడుతోంది.

 ఇప్పుడు తాజాగా బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌   ఐక్యత యత్నాలను కొనసాగించేందుకు రంగంలోకి దిగారు.  అయితే గతంలో ఈ ప్రయత్నం చేసిన కెసిఆర్‌తో నితీశ్‌ ముందుగా చర్చించి ఉంటే ఈ నితీష్ ప్రయత్నాలకు ఎంతో కొంత విశ్వసనీయత దక్కేది.  కానీ విపక్షాల ఐక్యతా యత్నాలను ఎవరు ప్రారంభించినా ప్రధాని కుర్చీని దృష్టిలో ఉంచుకునే  అడుగు ముందుకు వేస్తున్నారు. ఆ కారణంగానే ఆ కుర్చీకి తమతో పోటీకి వస్తారనుకున్న వారిని పక్కన పెట్టి ఆ ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడానికీ, ఇప్పుడు తాజాగా నితీష్ ఐక్యత అంటూ రాష్ట్రాలు చుట్టేయడానికీ కూడా ఇదే కారణం. దీంతో విపక్షాల ఐక్యత గత మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఐక్యతా యత్నాలే తప్ప ఐక్యత వాస్తవ రూపం దాల్చడం లేదు.  ఇక కేంద్రంలో  పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ కూడా  విపక్షాల ఐక్య కూటమికి నాయకత్వం వహించడాన్ని బాధ్యతగా కాకుండా ఒక హక్కుగా భావించడం వల్ల కూడా ఐక్యతా యత్నాలు ముందుకు సాగడం లేదు. తాజాగా నితీష్ కుమార్ , తేజస్వీ యాదవ్‌ కలసికట్టుగా ప్రారంభించిన ఐక్యతా యాత్ర కూడా తొలి అడుగులోనే తడబడిందనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన తొట్ట తొలిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. వీరిరువురూ కూడా కొద్ది కాలం కిందటే... బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీల ఐక్యతే తమ లక్ష్యం అని బాహాటంగా ప్రకటించారు. అటువంటప్పుడు కాంగ్రెస్ తో మహాఘట్ బంధన్ లో ఉన్న నితీష్, తేజస్విలు వారిని కలిసి ఐక్యతారాగం వినిపించడం వృధా ప్రయాసే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు.  మొత్తంగా ప్రధాని వెూడీ పాలనపై  ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా..  ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఉండటంతో జనం ఎటూ తేల్చుకోలేని  పరిస్థితిలో ఉన్నారు. ఇదే మోడీకి శ్రీరామరక్షగా మారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

2024 సార్వత్రిక ఎ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి అన్నదే బీజేపీయేతర పార్టీల లక్ష్యం.  గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలు ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేస్తున్న   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు, బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులందరిదీ అదే మాట. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,  భారత్ జోడో  యాత్ర చేశారు. అందుకోసమే  కమ్యూనిస్టులు ముందు వెనుకలు చూసుకోకుండా పొత్తులకు రెడీ అయిపోతున్నారు. కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అన్న కేసీఆర్ పంచన చేరడానికి  కూడా వారు ఒక్క క్షణం వెనుకాడని పరిస్థితి  ఉంది. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్, బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ, ఆప్ అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి మేరకు వారు వారి వారి దారిలో నడుస్తున్నారు.

శరద్ పవార్ అయితే మహా ముఖ్యమంత్రిగా తన మేనల్లుడిని కూర్చోపెట్టేందుకు పొత్తు యత్నాలకు మోకాలడ్డడానికి కూడా వెనుకాడటం లేదు.    బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరికీ తానే తలలోని నాలుక అంటూ హడావుడి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  ఇప్పుడు  అదే లక్ష్యంతో సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో  ఒంటరిగా పాద యాత్ర కు పరిమితమైపోయారు. ఆయన ఎక్కడ నడుస్తున్నారో, ఆయనకు జనం మద్దతు ఉందో లేదో తెలియని పరిస్థితి.  ఇటువంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతా యత్నాలు ఫలిస్తాయా? 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏకతాటిపై నడిచి విజయం సాధిస్తాయా అంటే ఔననే సమాధానం మాత్రం రావడం లేదు. 

By
en-us Political News

  
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.