విపక్షాల ఐక్యత ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు.. మోడీ బలం అదేనా?

Publish Date:Feb 23, 2023

Advertisement

కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం  అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది.

ముఖ్యంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కారణంగా ఈ చర్చ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.  ఈ  నేపథ్యంలోనే వచ్చే ఏడాది  సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని నిలువరించడమే లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డడానికి సన్నాహాలు చేస్తున్నది. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు ఇప్పటికే ప్రకటించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టించింది.  మల్లికార్జున్ ఖర్గే ప్రకటన నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి నడిచే పార్టీలు ఏవన్న చర్చ ప్రారంభమైంది.  ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ  తెలంగాణ   వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్  పొత్తుల అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొగ్రెసివ్ ఇండియా కోసం కాంగ్రెస్ లీడర్ షిప్ లో ఇప్పటికే టీమ్ సిద్ధం అయిందని గురువారం (ఫిబ్రవరి 23) ఒక ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్ మేరకు  కాంగ్రెస్ కూటమిలో 14 పార్టీలు ఉన్నాయి. అవి డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్ఎస్‌యూ, జేఎంఎం, యూఎంఎల్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, వీసీకే, పీడీపీ, ఎన్ సీ, కేసీ, ఎంఎన్ఎం . పరస్పరం గౌరవించుకుంటూ బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందడుగు వేస్తామని మాణికం ఠాకూర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇంకా కలిసి వచ్చే పార్టీలను సైతం స్వాగతిస్తామని పేర్కొన్నారు.  అయితే మాణికం ఠాగూర్ తాను ప్రకటించిన కూటమి పార్టీల జాబితాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను పేర్కొనకపోవడంపై నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కీలకమైన, జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించే సత్తా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను విస్మరించడంలోనే కాంగ్రెస్ కు విపక్షాల ఐక్యత, మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలపై ఉన్న చిత్తశుద్ధి అవగతమౌతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అంతే కాకుండా ఆ జాబితాలో వామపక్షాలు కూడా కనిపించకపోవడంపై కూడా కాంగ్రెస్ చెబుతున్న ఐక్యతపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. సహజంగానే బీఆర్ఎస్ కూడా ఆ జాబితాలో లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా బీజేపీయేతర కూటమి అంటూ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్న సంగతి తెలిసిందే.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.