విపక్షాల ఐక్యత ఎండమావేనా?.. తృణమూల్ ఒంటరి పోరు ప్రకటన సంకేతం అదేనా?

Publish Date:Mar 3, 2023

Advertisement

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్యత అన్నది ఎండమావేనా అంటే.. జాతీయ స్థాయిలో పార్టీల ఐక్యత విషయంలో జరుగుతున్న పరిణామాలును గమనిస్తే ఔననే అనాల్సి ఉంటుంది. విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడటమా? ఎన్నికల అనంతర పొత్తులకు మొగ్గు చూపడమా అన్న అంశంలో ఏ పార్టీ దారి ఆ పార్టీదే అన్నట్లుగా ఉంది. సరే అది పక్కన పెడితే.. 2024 సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ లోని   సర్దిఘి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ తృణమూల్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు.

అయితే ఈ  కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ అన్నీకుమ్మక్కై తృణమూల్ అభ్యర్థిని ఓడించారన్నది మమత ఆరోపణ. ఆ మూడు పార్టీలూ మతం కార్డు ఉపయోగించాయన్నారు. ఏక్కడైనా ఎప్పుడైనా సరే బీజేపీతో అవగాహన ఉన్న పార్టీలతో కలిసి తృణమూల్ పని చేయదనీ, అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తృణమూల్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టేశారు.  దీంతో విపక్షాల ఐక్యతకు ఆదిలోనే హంసపాదు పడిందని చెప్పవచ్చు. ప్రతిపక్షాల ఐక్యత, థర్డ్ ఫ్రంట్ అంటూ  పలు ప్రాంతీయ పార్టీలు రాజకీయ సందడి చేస్తుంటే  మమతా మాత్రం తనదారి వేరని కుండబద్ధలు కొట్టారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో దారుణైన ఓటమిపాలైన దీదీ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల మరుసటి రోజే ఈ కీలక ప్రకటన చేయటం విశేషం. ఈసారి ఎన్నికల్లో తమ పొత్త కేవలం ప్రజలతోనే ఉంటుందని ఏ ఇతర పార్టీతో ఉండదని దీదీ చెప్పారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి. కురువృద్ద కాంగ్రెస్ పార్టీ  అధినాయకురాలు సోనియా గాంధీ మొదలు, నిన్న మొన్ననే జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరకూ   బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులు అందరిదీ అదే మాట.

అయితే  అందుకోసం అందరూ ఒక్కతాటిపైకి వచ్చే విషయంలోనే ఎవరిలోనూ ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతోనే   కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ‘భారత్ జోడో’ యాత్ర చేశారు. ఆ లక్ష్యంతోనే వామపక్షాలు ఎవరితో అంటే వారితో చేతులు కలిపేందుకు  ఎవర్ రెడీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ ఇలా  ఎవరి శక్తి మేరకు  వారు  ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారుగా వ్యూహరచనలు చేసుకుంటున్నారు.  మరోవంక ఇప్పటి వరకూ బీజీపే వ్యతిరేక పార్టీల నేతలందరినీ   రింగ్ మాస్టర్లా ఆడిస్తూ వచ్చిన  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇక బయటి వారికి వ్యూహాల విక్రయ వ్యాపారం ఆపేసి బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తన దారిన తాను బీహార్ లో పాదయాత్ర చేసుకుంటున్నారు. సరే 2024 సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉంది. ఈ లోగా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి..

వాటి ఫలితాలను బట్టి విపక్ష ఐక్యతకు సారథ్యం ఎవరన్నది లేల్చుకోవచ్చు అనుకుంటే.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఆ ఫలితాలు విపక్షాల ఐక్యతా యత్నాలకు ఆదిలోనే గండి కొట్టాయి.  ఇంకా ఈ ఏడాది మరో ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్ సారథ్య రేసులో వెనుకబడిపోయందనే  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలు ఏకతాటి మీదకు రావడం అంటే ఏదో అద్భుతం జరగాల్సిందేనని అంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.