కొత్త రాష్ట్రపతికి విపక్షాల లేఖ

Publish Date:Jul 27, 2022

Advertisement

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు విపక్ష సభ్యుల సస్పెన్షన్లతో కొనసాగుతోంది. సమావేశాలు ప్రారంభమ రెండో వారంలోకి ప్రవేశించినా ఇప్పటి వరకూ సభ సజావుగా సాగింది లేదు. నినాదాలు, ఆందోళనలు, సస్పెన్షన్లకే పరిమితమైంది.   ప్రతిపక్షాలపై కేంద్రం ఈడీ, సీబీఐలను ప్రయోగించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉభయ సభలలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.  

ప్రజల సమస్యలను పార్లమెంటులో  ప్రస్తావించేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారనీ, అయితే కేంద్రం అందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదనీ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో నోరెత్తితే సస్పెండ్ చేస్తున్నారనీ, బయట ఆందోళన చేస్తుంటే అరెస్టు చేస్తున్నారనీ, కేంద్రంపై విమర్శలు చేస్తే ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై విపక్షాల సభ్యులు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంయుక్తంగా ఓ లేఖ రాశాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి   ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా తమను కేంద్ర ప్రభుత్వం  అడ్డుకుంటోందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే   ప్రతిపక్ష నేతలపై  ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ), సీబీఐలను కేంద్రం ఉసిగొల్పు తోందనీ, పాత కేసులను తవ్వుతూ, అక్రమంగా కొత్త కేసులను బనాయిస్తోందని వారా లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై మాత్రమే ఈడీ, సీబీఐలు దాడులు చేస్తోందని వారు పేర్కొన్నారు. తమ ఆరోపణలలోని వాస్తవాలను గుర్తించి తగిన విధంగా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని వారా లేఖలో కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. సోనియాగాంధీని ఈడీ విచారణ పేరుతో  రోజుల తరబడి మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగితే.. పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన విపక్షాలు కొత్త రాష్ట్రపతికి రాసిన లేఖలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందంటూ పేర్కొన్నారు.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం, దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్ష ఎంపీలు, నాయకుల ఇళ్లపై దాడులు ఈడీ దాడులను కూడా ప్రతిపక్ష ఎంపీలు తమ సంయుక్త  లేఖలో ప్రస్తా వించారు.   ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాల హక్కులను కాపా డాల్సిన బాధ్యత దేశ రాష్ట్రపతిపై ఉందని ఉందని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ప్రతిపక్ష ఎంపీలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని వారు ఎండగట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ విపక్షాల పట్ల ఇంత కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాలు రాసిన లేఖపై కొత్త రాష్ట్రపతి ఎలా స్పంది స్తారో వేచి చూడాలి.   

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.