Publish Date:Jul 27, 2022
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు విపక్ష సభ్యుల సస్పెన్షన్లతో కొనసాగుతోంది. సమావేశాలు ప్రారంభమ రెండో వారంలోకి ప్రవేశించినా ఇప్పటి వరకూ సభ సజావుగా సాగింది లేదు. నినాదాలు, ఆందోళనలు, సస్పెన్షన్లకే పరిమితమైంది. ప్రతిపక్షాలపై కేంద్రం ఈడీ, సీబీఐలను ప్రయోగించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉభయ సభలలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.
ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారనీ, అయితే కేంద్రం అందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదనీ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో నోరెత్తితే సస్పెండ్ చేస్తున్నారనీ, బయట ఆందోళన చేస్తుంటే అరెస్టు చేస్తున్నారనీ, కేంద్రంపై విమర్శలు చేస్తే ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై విపక్షాల సభ్యులు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంయుక్తంగా ఓ లేఖ రాశాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా తమను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే ప్రతిపక్ష నేతలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ), సీబీఐలను కేంద్రం ఉసిగొల్పు తోందనీ, పాత కేసులను తవ్వుతూ, అక్రమంగా కొత్త కేసులను బనాయిస్తోందని వారా లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై మాత్రమే ఈడీ, సీబీఐలు దాడులు చేస్తోందని వారు పేర్కొన్నారు. తమ ఆరోపణలలోని వాస్తవాలను గుర్తించి తగిన విధంగా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని వారా లేఖలో కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. సోనియాగాంధీని ఈడీ విచారణ పేరుతో రోజుల తరబడి మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగితే.. పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన విపక్షాలు కొత్త రాష్ట్రపతికి రాసిన లేఖలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందంటూ పేర్కొన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం, దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్ష ఎంపీలు, నాయకుల ఇళ్లపై దాడులు ఈడీ దాడులను కూడా ప్రతిపక్ష ఎంపీలు తమ సంయుక్త లేఖలో ప్రస్తా వించారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాల హక్కులను కాపా డాల్సిన బాధ్యత దేశ రాష్ట్రపతిపై ఉందని ఉందని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ప్రతిపక్ష ఎంపీలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని వారు ఎండగట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ విపక్షాల పట్ల ఇంత కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాలు రాసిన లేఖపై కొత్త రాష్ట్రపతి ఎలా స్పంది స్తారో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/opposition-mps-letter-to-new-president-murmu-39-140698.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.