జనంలో టీడీపి..భయంలో వైసీపీ

Publish Date:May 20, 2023

Advertisement

ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికా ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే వాటి ఎన్నికల సన్నాహకాలలోనే ఏ పార్టీ ఎక్కడ ఉందన్నది తేటతెల్లమౌతోంది. తెలుగుదేశం జనంలో ఉంటే.. వైసీపీ నాలుగు గోడలకే పరిమితమైంది. 

 అధికారం కోసం ప్రజా క్షేత్రంలో జరిగే  ఎన్నికల సమయంలో  తెలుగుదేశం ప్రజలతో మమేకమై దూసుకుపోతుంటే.. వైసీపీ నాలుగు గోడల మధ్యే పరిమితమై.. నోటికి పరిచెప్పడంతో పరిపెట్టుకుంటోంది. అదే సమయంలో  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయింది.  జగన్ నాలుగేళ్ల  పాలనలో  అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదే ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లారు.  

రాష్ట్ర వ్యాప్తంగా  సూడిగాలి పర్యటనలు  చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  పాదయాత్ర  చేస్తూ ననిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. జగన్ అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో  అడుగంటిన అభివృద్ధి, సంక్షేమం గురించి సోదాహరణంగా  వివరిస్తూ ముందుకు దూసుకెళ్తన్నారు.  అలాగే ఆ పార్టీ శ్రేణులు సైతం పార్టీ అధినేత, అగ్రనేత అడుగు జాడల్లో నడుస్తున్నారు. 

అయితే అందుకు భిన్నంగా అధికార పార్టీ మాత్రం ప్రజలకు ముఖం చాటేస్తోంది.  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కానీ.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ..  జనంలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు.  తాను కాకుండా ఎమ్మెల్యేలను మంత్రులను జనంలోకి పంపేందుకు జగన్  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా ప్రజా నిరసన ఎదురైంది. దీంతో వారు జనంలోకి వెళ్లడానికి జంకుతున్నారు. దీంతో జగన్ తనకు మరో సారి పదవీ యాగం కోసం జనం సొమ్ముతో యాగాలు చేసుకుంటూ అధికారం కోసం జపం చేస్తున్నారు.

ఇక పార్టీలో పెల్లుబుకుతున్న అసమ్మతి, అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలను నిలువరించేందుకు కూడా జగన్ ఇసుమంతైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. వివేకా హత్య కేసు పరిణామాలు జగన్ కు వరుసకు సోదరుడు, కడప ఎంపీ అయిన అవినాష్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. మొదట్లో ఆయనను కాపాడడానికి హస్తిన కేగి మరీ ప్రయత్నాలు చేసిన జగన్ ఇప్పుడు ఆ మరక తనకు అంటకుండా ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తూ మౌనం పాటిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు.

పార్టీ క్యాడర్, నాయకులు, ఎమ్మెల్యేలూ, మంత్రులూ అందరినీ పక్కన పెట్టి కాపాడండి మహప్రభో అంటూ వాలంటీర్లను వేడుకుని వాళ్లే గట్టెక్కిస్తారన్న ఆశతో, గట్టెక్కిస్తారా అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు. మొత్తంగా ఏపీ లో  ఎన్నికల సంవత్సరంలో వైసీపీ వైఫల్యాలపైనే జనంలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆ చర్చను సజీవంగా ఉంచడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సఫలీకృతం అవుతోంది. 

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.