మెడీ బలం విపక్షాల అనైక్యతే!

Publish Date:Jul 24, 2022

Advertisement

 రాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక అయిపోతుంది. విపక్షాల ఐక్యత ఎండమావేనని మరోసారి తేలిపోయింది. మళ్లీ మళ్లీ అదే రుజువు అవుతుంది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుస విజయాలకు అసలైన కారణం సొంత ప్రతిభ కంటే.. సొంత బలం కంటే విపక్షాలలో ఉన్న అనైక్యతే కారణమని పదే పదే రుజువు అవుతోంది. అయినా విపక్షాలు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.

సొంత బలం కంటే తమ అనైక్యతే మోడీ సర్కార్ బలోపేతం కావడానికి కారణమౌతోందని తెలిసినా, విభేదాలను పక్కన పెట్టి కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఏకాభిప్రాయానికి రావడంలో ఘోరంగా విఫలమౌతోంది.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను చూస్తున్న సామాన్య ప్రజలకు కూడా తెలుస్తున్న ఈ సంగతి విపక్షాలకు ఎందుకు తెలియడం లేదో అర్ధం కాదు. రాష్ట్రపతి ఎన్నికలలో ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల్లో   క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మ‌ద్ద‌తుగా ఉన్న వారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేశారు. అంటే విపక్ష పార్టీల ఐక్యత ఎంత బలంగా ఉందో తేటతెల్లమౌతుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే  సరే సరి.  ఓటింగ్ కు దూరం అని మమతా బెనర్జీ ప్రకటించడంతోనే విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు నిలిపాయన్నది కూడా అర్ధం కాని పరిస్థితి.

  తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీని ఎదుర్కోక తప్పని పరిస్థితి. అయితే ఆ రెండు పార్టీల కార్యక్షేత్రం వాటి వాటి రాష్ట్రాలే. ఎందుకంటే బీజేపీతో పోరు చేయకుంటే ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకోవడం ఆ పార్టీలకు అసాధ్యమౌతుంది కనుక. ఈ రెండు పార్టీలూ మినహాయిస్తు మిగిలిన విపక్షాలు వేటికీ కేంద్ర ప్రభుత్వంతో అంటే బీజేపీతో జాతీయ స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాజకీయాలలో అదీ జాతీయ స్థాయి రాజకీయాలలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది.

దీంతో జాతీయ స్థాయిలో బీజేపీ పోటీ ఇచ్చే పార్టీ కానీ, కూటమి కానీ లేకుండా పోయింది.  కేంద్రంలో మోడీ సర్కార్ పై జాతీయ స్థాయిలో ఎంత వ్యతిరేకత ఉన్నా.. ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితుల్లో జనానికి కూడా బీజేపీ వినా మరో పార్టీ కనిపించని పరిస్థితి నెలకొంది.  ప్రజలు ప్రత్యామ్నాయం కనిపించినప్పుడే తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటుతారు. అలా కనిపించనప్పుడు ఎవరైతేనేం అన్న నిర్లిప్తంతో ఉండిపోతారు. ఇప్పుడు దేశంలో ప్రజల   పరిస్థితి అదే.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.