యుద్ధం ప్రకటించిన విపక్షం.. వైసీపీ హ్యాండ్సప్?!

Publish Date:Aug 17, 2023

Advertisement

ఏపీలో ప్రతిపక్ష నేతలు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా వరసపెట్టి యాత్రలు చేపడుతూ దూసుకెళ్తున్నారు.  ఇంకా చెప్పాలంటే ఏపీలో ఉన్న జిల్లాలను అన్నీ ఒకటికి పదిమార్లు కలియతిరిగే పని పెట్టుకొని ఇప్పటికే కొన్ని జిల్లాలను పూర్తి చేశారు. వెళ్ళిన ప్రతీ చోటా జనాల స్పందన కూడా విపక్ష నేతలకు బ్రహ్మరథం పడుతున్నట్లుగానే ఉంది. ఎక్కడిక్కడ ఘన స్వాగతాలు లభిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎన్నికల వరకూ కూడా లోకేష్ ప్రజలలోనే ఉంటారు. చంద్రబాబు కూడా రాయలసీమ నుండి గోదావరి జిల్లాల వరకూ ఒక రౌండ్ వేసి.. ఈ మధ్యనే విశాఖలో కూడా కదలిక తెచ్చి వెళ్లారు.   చంద్రబాబు కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలలోనే మమేకమౌతూ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విడతల వారీగా వారాహి యాత్రతో జనంలో తిరుగుతున్నారు.  పవన్ కూడా ఎన్నికల వరకూ ఇలాగే ఏదో ఒక పేరుతో రాష్ట్ర నలుమూలలను టచ్ చేయనున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. అయితే, జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ ఆ పొత్తును ఎన్నికల వరకూ కొనసాగిస్తుందా? టీడీపీతో  కూడా కలుస్తుందా అన్న సస్పెన్స్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.  ఈ ఒక్కటీ క్లారిటీ వస్తే ఏపీలో ఎటు చూసినా ప్రతిపక్ష నేతల సందడే కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంకా  స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది దండయాత్రగా భావిస్తే.. పొత్తులు క్లారిటీ అనంతరం ఇక యుద్ధమే అని చెప్పక తప్పదు.  పొత్తులు ఉన్నా లేక విడివిడిగా పోటీకి దిగినా ప్రచారం మాత్రం ఓ స్థాయిలో హోరెత్తుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

 ఎన్నికలకు ఎనిమిది తొమ్మిది నెలలే ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దండయాత్ర మొదలు పెట్టాయి. తలా ఒకవైపు ప్రతిపక్ష నేతలు ఇంతగా విమర్శలకు దిగినా.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నా, సీఎంగా జగన్ చేతగాని తనాన్ని ఎత్తి చూపుతున్నా అధికార పార్టీ నుండి ఉలుకూ పలుకూ ఉండడం లేదు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా మొదటి నాలుగేళ్ళూ ఎలా ఉన్నా చివరి ఏడాది మాత్రం ఏదో ఒకటి చేసి   ప్రజలను ఆకర్షించి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తుంది. ఇందుకోసం ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎక్కడ లేని దూకుడూ ప్రదర్శిస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. ఆ కార్యక్రమాల పేరుతో సభలు, సమావేశాలతో నిత్యం ప్రజలతో అక్కడి అధికార పార్టీ నేతలు మమేకమౌతున్నారు. ఎప్పుడో కానీ ఫామ్ హౌస్ దాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జనంలోనే తిరుగుతున్నారు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీలో అటువంటి హడావుడి ఇసుమంతైనా కనిపించడం లేదు.  

అడపాదడపా సీఎం జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్లి అక్కడే ఎవరో రాసిచ్చిన నాలుగు ముక్కలు మాట్లాడేసి వస్తున్నారు. అయితే, ముందు బటన్ నొక్కిన కార్యక్రమాలకే డబ్బులు లేక కొత్త పథకాలు ప్రకటించే అవకాశం లేదు. కనుక సీఎం బయటకి రావడం అంటే ఏదో అమావాస్యకి పౌర్ణమికి మాత్రమే సాధ్యం. ఇక మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంతే. మొన్నటి వరకూ పార్టీని, సీఎంను ఎవరు ఏమన్నా నోరేసుకొని పడిపోయే నేతలంతా ఇప్పుడు మైకుల ముందుకు రావడం మానేశారు. ప్రతిపక్షం ఒక్కో అంశాన్ని గుచ్చి గుచి ప్రశ్నించినా కనీసం ఆ శాఖల మంత్రి కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పడం లేదు.

గతంలో కూడా మంత్రులు తమ శాఖల గురించి మాట్లాడిన సందర్భాలు అతి స్వల్పమే. అన్నిటికీ ఒకటే మందు జింతా తిలిస్మాత్ అన్నట్లు అన్ని శాఖలకూ ఒకే మంత్రి అన్న చందంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లడతారు. ఆయన కూడా ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి, వివిధ శాఖలలో సాధించిన ప్రగతి గురించి కాకుండా.. విపక్షాలపై విమర్శలు, విసుర్లు, అనధికారికంగా అభ్యర్థుల ప్రకటనలకు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. విపక్షాలు నిలదీసిన అంశాలపై మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్లు వైసీపీ నేతలు, మంత్రులు, చివరాఖరికి సీఎం జగన్ కూడా వ్యవహరిస్తున్నారు. 

దీంతో సహజంగానే వైసీపీ ఎందుకిలా అనే చర్చమొదలైంది. నిజానికి ఎప్పుడో రెండేళ్ల కిందటే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకతపై సీఎం జగన్ వద్ద ప్రస్తావించే సాహసం చేశారు. అయితే ఆయన వినడం మానేసి  నాకన్నీ తెలుసు మీరు పనిచేసుకుంటూ వెళ్ళండి ఓట్లు అవే వస్తాయని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ప్రజా వ్యతిరేకత గురించి సొంత పార్టీ నేతల మాటలను కూడా పెడచెవిన పెట్టిన ఫలితం ఇప్పుడు పార్టీ అనుభవించాల్సి వస్తోందని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాలలో  ఒకరికొకరు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇప్పుడు  పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గొంతు చించుకుంటే ప్రజలలో ఇంకా చులకన అవడం తప్ప ప్రయోజనం లేదని, పార్టీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని గ్రహించే ప్రతిపక్షాలను ఎదుర్కోవాలనే ఆదేశాలివ్వడం లేదని పార్టీ నేతల మధ్య  సంభాషణ సాగుతోంది. మొత్తంగా  ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వైసీపీ హ్యాండ్సప్ చెప్పినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.