సీజేఐకి ఇండియా కూటమి పార్టీల బహిరంగ లేఖ

Publish Date:Jul 1, 2026

Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం   పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలే విమర్శించాయి.  ఎన్నికల నిర్వహణలో, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని  ధ్వజమెత్తాయి.ఈ మేరకు ప్రతిపక్ష  ఇండియా కూటమి పార్టీలు సంయుక్తంగా భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. ఈ విషయంలో  సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఎన్నికల సంఘం నిర్ణయాలపై సమగ్ర న్యాయ సమీక్ష   నిర్వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశాయి.   దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని  పేర్కొన్నాయి. ఈ లేఖపై  ఇండియా కూటమికి చెందిన  23  పార్టీల నాయకులు సంతకాలు చేశారు. 

 ప్రతిపక్షాలన్నీ కలిసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది. గతనెల  8న జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీజేఐకి ఇండియా కూటమి పార్టీలు సంయుక్త లేఖ రాశాయి. ఈ లేఖపై ఇండియా కూటమి పార్టీల నేతలే కాకుండా, కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే, ఆప్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా సంతకాలు చేశారు. అలాగే ఒక ఇండిపెండెంట్ ఎంపీ కూడా వీరిలో ఉన్నారు.  

వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ' సర్  ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. అధికార పార్టీకిలబ్ధి చేకూరేలా..   ఓటర్ల జాబితాను మేనిపులేట్ చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, డెరెక్ ఒబ్రెయిన్ వంటి అగ్రనేతలు బ  విమర్శలు గుప్పించారు.  రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగానైనా స్వీకరించి, ఈసీ పక్షపాత వైఖరిపై విచారణ జరపాలని ఇండియా కూటమి పార్టీలు ఆ లేఖలో కోరాయి. 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.