అలసిపోయానంటూ.. ఒక డాక్టర్ పెట్టిన పోస్ట్ వైరల్
Publish Date:Jan 6, 2021
Advertisement
కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడి ప్రజల ప్రాణాలు రక్షించిన వారిలో డాక్టర్లు అందరికంటే ముందున్న సంగతి తెలిసిందే. అటువంటి ఒక డాక్టర్ పోస్ట్ చేసిన ఒక లెటర్ తాజాగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ లెటర్ వివరాల్లోకి వెళితే... ఆయన రాసిన లేఖ పూర్తి సారాంశం.. ఇదీ కరోనా రోగుల సేవలో అలసిపోయిన ఓ వైద్యుడి ఆవేదన. ఇదిలా ఉండగా.. తమిళ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే.. ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసినప్పటికీ.. కొంతమంది మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తి స్థాయిలో ఇంకా కంట్రోల్ కాకుండానే థియేటర్లలోకి ప్రజలను అనుమతిస్తే.. రెండున్నర గంటల పాటు మూసి ఉంచే చోట వైరస్ ప్రబలడానికి చేతులారా అవకాశమిచ్చినట్టవుతుందని చెబుతున్నారు. ఈ నిర్ణయం ఎంత మాత్రం సరైంది కాదని నిపుణులు కూడా వాదిస్తున్నారు. సినీ పరిశ్రమ నష్టాల్లో ఉంటే ఆ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టి పెట్టాలి.. అంతేగానీ ఇలా నిర్మాతల వ్యాపారం కోసం అమాయకులను బలి చేయడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. ఒకపక్క "మాస్టర్" సినిమా విడుదల నేపథ్యంలో సీఎం పళనిస్వామిని హీరో విజయ్ కలిసిన రోజుల వ్యవధిలోనే థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో సినిమా థియేటర్లలో వంద శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా కరోనా పూర్తిగా తగ్గని ప్రస్తుత పరిస్థితుల్లో పళని స్వామి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర చర్చజరుగుతోంది. ఒకపక్క పాతరకం కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న నేపథ్యంలో, కొత్త స్ట్రెయిన్ కేసులు కూడా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదనే వాదన ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఒక వైద్యుడు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందన ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేసింది. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జేఐపీఎంఈఆర్) పుదుచ్చేరిలో రెసిడెంట్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అరవింద్ శ్రీనివాస్ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి ఇచ్చిన ఆమోదం పై ఆవేదనతో కూడిన పోస్ట్ చేశాడు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు హీరో విజయ్, శింబులను ఉద్దేశిస్తూ అతడు ఒక లేఖ రాశాడు.
"నేను అలసిపోయాను. మేమంతా కూడా అలసిపోయాం. నాలాంటి వేలమంది వైద్యులు అలసిపోయారు. హెల్త్ కేర్ వర్కర్లు అలసిపోయారు. పోలీసు అధికారులు అలసిపోయారు. పారిశుద్ధ్య కార్మికులు అలసిపోయారు. ఊహించని ఉపద్రవం వల్ల జరిగిన నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు కింది స్థాయి సిబ్బంది నుంచి అందరం చాలా తీవ్రంగా శ్రమించాం. చూసేవాళ్లకు మేం పడిన కష్టం గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మా ముందు ఎలాంటి కెమెరాలు లేవు. అంతేకాకుండా మేము ఎలాంటి స్టంట్ సీక్వెన్స్‌లూ చేయలేదు. మేము హీరోలం కూడా కాదు. కానీ.. మేం ఊపిరి పీల్చుకోవడానికి కొంత సమయం కావాలి. ఈ ఉపద్రవం ఇంతటితో అయిపోలేదు.
కరోనాతో ఇప్పటికీ కొంతమంది ప్రజలు చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడమంటే అది ఆత్మహత్యా సదృశ్యమే, అంతేగాక సామూహిక జన హననమే అవుతుంది. సినిమాను వంద శాతం ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఏ ప్రజాప్రతినిధి గానీ, హీరోలుగా చెప్పుకునే ఏ ఒక్కరూ సిద్ధంగా ఉండరు. కొంచెం నెమ్మదిగా ఆలోచించి, మా ప్రాణాలపై కూడా కాస్త శ్రద్ధ పెట్టి కనికరం చూపండి.
ఇట్లు
అలసిసొలసిన, ఓ నిస్సహాయ వైద్యుడు"
http://www.teluguone.com/news/content/open-letter-from-a-tired-resident-doctor-to-tn-govt-goes-viral-39-108612.html





