చంద్ర బాబు కోసం!

Publish Date:Oct 28, 2023

Advertisement

స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ఆదివారం (అక్టోబర్ 29) న ‘కళ్లు తెరవాలి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆ కార్యక్రమంలో భాగంగా  ఆదివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 గంటల వరకూ ఐదు నిముషాలు  కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినదించాలని తెలుగుదేశం  పిలుపునిచ్చింది. అలా చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది. 

స్కిల్ డెవలప్‌మెంట్‌లో కుంభకోణం జరిగిందని.. అందులో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సెప్టెంబర్ రెండో వారంలో ఆయన్ని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన అక్కడే  ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోనే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. తెలుగుదేశం పార్టీ పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ క్రమంలో అక్టోబర్ 23న విజయదశమి రోజున మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతకు ముందు అంటే అక్టోబర్ 15న న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం చేపట్టింది. అదే విధంగా అక్టోబర్ 7వ తేదీన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక సెప్టెంబర్ 30న మోత మొగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇవన్నీ రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్య చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టారు. ఇంకోవైపు చంద్రబాబుని అరెస్ట్ చేసి 50 రోజులు పూర్తి కావోస్తోంది. సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.  ఇక చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో.. ఆ విషయాన్ని తట్టుకోలేక 105 మంది మరణించారు.   చంద్రబాబు అరెస్ట్ అక్రమమని నినదిస్తూ.. ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజల మధ్యకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్పూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.