హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2025 పోటీల్లో 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ టైటిల్ గెల్చుకున్న విషయం తెలిసిందే. సుచాత మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. థాయ్ లాండ్ లోని ఫుకెట్ లో సుచాత జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తానెట్ డోంక్‌మనెర్డ్, సుపత్రా చువాంగ్ శ్రీ. చువాంగ్ శ్రీ కుటుంబానికి థాలాంగ్‌లో బిజినెస్ ఉంది. ప్రాథమిక విద్యాభ్యాసం ఫుకెట్ లోనే పూర్తిచేసిన సుచాత.. బ్యాంకాక్ లో ఉన్నత విద్య పూర్తిచేశారు. ప్రస్తుతం బ్యాంకాక్ లోని థమ్మసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నారు. ఈ మేరకు రూ.8.5 కోట్ల నగదుతో పాటు 1,770 వజ్రాలు పొదిగిన కిరీటం సుచాత సొంతమైంది.
అదేవిధంగా ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు కూడా ఆమె అర్హురాలైంది. ఈ సందర్భంగా ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ మీడియాతో మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకరమైందని అన్నారు. తెలంగాణలో తన ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి మళ్లీ తెలంగాణకు వస్తానని తెలిపారు. 16 ఏళ్లకే రొమ్ము కేన్సర్‌కు గురయ్యాను. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో వ్యాధి నుంచి తప్పించుకున్నాని మిస్ వరల్డ్ పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో నా శారీరక, మానసిక అవస్థ వర్ణనాతీతం. మహిళలను వేధించే ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరమని గుర్తించానఃన్నారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమన్న విషయం ప్రతి మహిళకు చేరేలా ప్రచారం చేస్తున్నాను. ఇది సత్ఫలితాన్నిస్తోంది. నాకు మా అమ్మే స్ఫూర్తి.
తెలంగాణలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఇక్కడి సంస్కృత, మనుషులు, పర్యాటక ప్రదేశాలు అద్బుతం అని పేర్కొన్నారు. బహుబలి సినిమా గురించి తాను విన్నానని ఆ సినిమా చూసి రివ్యూ ఇస్తానని తెలిపారు. ఓపల్ సుచాతా గత నాలుగేళ్లుగా మోడలింగ్ రంగంలో ఉన్నారు. ఆమె తన అందాల పోటీల ప్రస్థానాన్ని 2021లో మిస్ రత్తనకోసిన్ పోటీలతో ప్రారంభించారు. 2022లో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండో రన్నరప్ తప్పుకోవడంతో ఆమె రెండో స్థానానికి ప్రమోట్ అయ్యారు. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకరమైందని అన్నారు. అందుకోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపారు. తల్లితండ్రులు తనకు ఎంతగానో సహకారం అందించారని గుర్తు చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/opal-suchata-suangsri-39-199093.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.