Cooler Risk కూలర్ వాడుతున్నారా? జాగ్రత్త.. ఈ ఒక్క తప్పు చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది!

Publish Date:May 28, 2026

Advertisement

వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా, వేసవి నుండి ఎంతో ఉపశమనంగా కూడా ఉంటుంది.  చాలా మంది కూలర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దీనివల్ల సౌకర్యం చేకూరకపోగా ఆరోగ్య ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కూలర్ వాడేవారు చేసే ఒకే ఒక తప్పు కుటుంబ సభ్యులకు మొత్తం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అదేంటో.. ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుంటే..

కూలర్ ప్యాడ్లు..

కూలర్ ప్యాడ్‌ల మీద చాలా తొందరగా దుమ్ము,  ధూళి పేరుకుపోతుంది.  చాలామంది వేసవి అవ్వగానే కూలర్ ను అలా ఒకమూల పెట్టేయడం,  తిరిగి వేసవి రాగానే దాన్ని మళ్లీ వాడటం మొదలుపెడతారు. అంతేకానీ కూలర్ ప్యాడ్ ల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోరు. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లు దుమ్ము, బ్యాక్టీరియా , ఫంగస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ కలుషితమైన గాలి గది అంతటా వ్యాపించినప్పుడు, అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఎవరికి ప్రమాదమంటే..

కూలర్ ప్యాడ్ లు ఇలా మురికిగా మారడం ముఖ్యంగా పిల్లలకు , వృద్ధులకు ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల, వేసవి కాలంలో కూలర్‌లను సరిగ్గా శుభ్రపరచడం , వాటి నిర్వహణ అత్యంత ముఖ్యం.

కూలర్ ప్యాడ్ లు మురికిగా మారితే కలిగే ప్రమాదాలు..

శ్వాసకోశ సమస్యలు..

మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి , బ్యాక్టీరియా పేరుకుపోతాయి, ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించగలవు.  దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు పెరగవచ్చు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఊపిరితిత్తులపై కూడా ప్రభావం పడవచ్చు.

అలెర్జీల ప్రమాదం..

మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లపై త్వరగా బూజు, శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది చర్మం , కంటిలో చికాకు, దురద ,  అలెర్జీ రియాక్షన్స్ వంటి వాటికి  కారణం అవుతాయి.  ఇప్పటికే అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు.

దుర్వాసన, గాలి కాలుష్యం..

కూలర్‌ను చాలా కాలం పాటు శుభ్రం చేయకపోతే, దాని నుండి వచ్చే గాలిలో ఒక వింత వాసన వస్తుంది.  ఈ వాసన గది వాతావరణాన్ని అనారోగ్యకరంగా మార్చడమే కాకుండా, తలనొప్పి లేదా ఇతర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు.

ఇన్పెక్షన్..

మురికి నీరు , కలుషితమైన ప్యాడ్‌ల వల్ల కూలర్‌లో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి, దీంతో జ్వరం , ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం..

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన పిల్లలు , వృద్ధులు,  అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు  మురికిగా ఉండే చల్లని గాలి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. దీనివల్ల వారికి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారి గదిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

                   *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.