Publish Date:Jun 17, 2022
ఇంట్లో పిల్లలతో పాటు కుక్కపిల్లనో, పిల్లినో పెంచుకోవడం చాలా మందికి అలవాటు. అదో సరదా! వాటి సంరక్షణను ఎంతో జాగ్రత్తగా చేపడుతుంటారు. వాటిని ఇంట్లోని సొంత మనుషుల్లాగే, కుటుంబ సభ్యుల్లాగే ప్రేమగా చూసుకుంటుంటారు. పూర్వం గుర్రాలనూ, పులులనూ కూడా పెంచుకునే వారని విన్నాం. ఎవరయినా కప్పల్ని పెంచేవారుంటారా? ఎన్నడైనా కనీ వినీ ఎరుగుదుమా? కానీ ఇదుగో నేనున్నానంటూ ఒకాయన ఈమధ్యే టిక్ టాక్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. ఆ మహానుభావుడు ఎవరో గాని లోకంలో మరేదీ దొరకనట్టు ఏకంగా 1.4 మిలియన్ల కప్పల్ని అంటే ఓ పెద్ద కప్పల దండును పెంచి పోషిస్తున్నాడు! అసలు కప్పల బెక బెకలు వినడమే కష్టం. నీళ్లలోంచి నేల మీదకి, నేలమీద నుంచి నీళ్లలోకి అలా గెంతుతూ ఆడుతూ బెక బెక మంటూ మహా చికాకు కలిగిస్తుంటాయి. వాటిని చూస్తే ఎప్పుడు మీదకు దూకుతాయోనని భయంతోనో, ఆసహ్యంతోనో ఒళ్లు జలదరింపూ వుంటుంది. అలాంటిది ఆయన ఏదో దేశానికి సైన్యం తయారు చేసుకున్నట్టు, ఫుట్ బాల్ జట్లకు శిక్షణ ఇస్తున్నట్లు కప్పల్ని పెంచి పోషించడం నిజంగా విడ్డూరమే!
ఈ కప్పల దండును తన తోటలో పెంచుతున్న పెద్దమనిషి వాటి మీద ప్రేమ గురించి మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో కప్ప గుడ్లు జాగ్రత్త చేసి వాటి నుంచి తోక కప్పలు పుట్టగానే, వాటిని రక్షించి వాటి పెరుగుదలను దగ్గరగా గమనిస్తూ సంరక్షిస్తున్నానన్నాడు. పిల్లల పెంపకంతో సమానంగా దీని పట్ల ఆయనకు ఎంత శ్రద్ధో! ముందు నీటి కుంటల్లోకి గుడ్లు వదిలి పిల్ల కప్పలుగా బయటికి వచ్చాక అవి పెరిగి పెద్ద పెద్ద కప్పలుగా రూపాంతరం చెందడంలో వాటికి ఎంతో రక్షణ కల్పించాడట. ఇలా అవి ఐదు పది కాదు వందల సంఖ్యలో ఆయన ఇంటి పెరటి తోటనంతా తమ నివాసం చేసుకున్నాయి.
ఇంత పెద్ద కప్పల దండును తయారు చేయ డంలో ఎంతో ఆనందిస్తున్నానని వీడియో లో తన సంతోషాన్ని పంచుకుంటూ తన్మయత్వం చెందాడు. తమాషా ఏమంటే, ఇపుడు ఆయన తన పెరటి తోటలో పచ్చిక మీద నడవడానికి బొత్తిగా అవకాశం లేదట. అటు వెళ్లి అంతకుముందులా సరదాగా తిరుగుదామంటే పాదాల కింద పడి కప్పలు ఛస్తాయేమోనని భయం పట్టుకుని అటు వెళ్లడం మానుకోవాలని నిర్ణయానికి వచ్చేడట! చూశారా ఆ పెద్ద మనిషి కప్పల ప్రేమ. మనం ఎంత ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్లో, పిల్లి పిల్లో అడ్డు తగిలితే కాలితో తన్ని అవతలకు నెట్టేస్తుంటాం. కానీ ఆయన అసలు వాటిని ఇబ్బంది పెట్టకూడదని అటు వేపు వెళ్లడం బాగా తగ్గించేశాడట! అన్నట్టు ఆయన కప్పల దండును చూడ్డానికి ఇపుడు వందల మంది క్యూ కడుతున్నారని చెబుతున్నాడు.
ఆయన సామాజిక మాధ్యమంలో వదిలిన ఈ వీడియో ఇప్పటికి 2.8 లక్షలమంది చూశారు. ట్విటర్‌లో దాన్ని రామ్సే బోల్టిన్ అనే అతను షేర్ చేశాడు. చాలా మంది ఈ కప్పల దండు యజమానిని కలిసి ఆయన ఈ సైన్యం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయన కప్పల సైన్యాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేసినవారూ వున్నారు. ఈపెద్ద మనిషి అన్ని వేల కప్పలతో పెద్ద సైన్యాన్ని తయారు చేసిన ఆనందంలో వున్నాడు గానీ, నిజానికి ఈ వ్యక్తి కప్పల దండు వల్ల పర్యావరణ విపత్తు కలిగేందుకు ఆస్కారం వుందంటున్నారు పలువురు పర్యావరణ వేత్తలు. కాగా మరొకతను చిన్నపుడు తమ నివాసం సమీపంలోని చెరువులో అస్సలు కప్పలే లేకపోవడం పట్ల విచారించాను, చెరువు అంతా కప్పల బెక బెకతో నిండాలని అనుకునేవాడిని. కానీ ఇన్ని వేల కప్పలను చూశాక అమ్మో నేను ఇలాంటి పనులు చేయలేదు నయమే! అని ట్వీట్ చేశాడు. మొత్తానికి కప్పల సైన్యంతో ఆ మనిషి ఎలా వేగుతున్నాడో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-mans-frog-army-attracted-netizens-gone-viral-on-social-media-39-137895.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.