న్యాయశాఖ పరిశీలనలో జమిలి ప్రతిపాదన

Publish Date:Jul 23, 2022

Advertisement

జమిలి ఎన్నికల విషయాన్ని కేంద్రం ఇంకా వదల లేదు. లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం కలిసి వస్తుందని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం లాకమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. లోక్ సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలపై  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు చెప్పారు.

కాగా  స్టాండింగ్ కమిటీ   కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని, ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోందని ఆయన తెలిపారు. తరచుగా వచ్చే ఎన్నికల వల్ల నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం వ్యయం అవుతుందనీ, దేశంలో 2014-22 మధ్యకాలంలో 50  ఎన్నికలు జరిగాయని స్టాండింగ్ కమిటీ  వివరించింది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 7వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యిందని కిరణ్ రిజుజు తెలిపారు. కిరణ్ రిజుజు సమాధానంతో కేంద్రం మదిలో   జమిలి   ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని,   లోక్​సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఉందని అవగతమౌతుంది.  

మోడీ అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఎన్నికల విధానంలో మార్పుల వల్ల అభివృద్ధి వేగవంతమౌతుందని ఆయన చెబుతున్నారు. లోక్ సభ నుంచి స్థానిక ఎన్నికల వరకూ ఒకే సారి నిర్వహించడం వల్ల ప్రజా ధనం ఆదా కావడమే కాకుండా అభివృద్ధికి అవరోధాలు ఉండవని అన్నారు. అయితే విపక్షాలు నిర్ద్వంద్వంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చెబుతున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అంటున్నారు. జమిలి పేర కేంద్రంతో పాటు రాష్ట్రాలలో కూడా అధికారం  గంపగుత్తగా చేజిక్కించుకోవాలన్న  దురాలోచనలో ప్రభుత్వం ఉందని అభ్యంతరం చెబుతున్నాయి.

అయితే లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నది మోడీ వాదన.  పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయన్నది ఆయన అభిప్రాయం.  2019 బీజేపీ మానిఫెస్టోలో జమిలి అంశాన్ని చేర్చింది.  నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.  

అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇందుకు దేశంలో సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసర అవుతుంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల సంఖ్యే అధికం. లోక్ సభలో మోడీ సర్కార్ కు పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో సభ్యుల బలం ఒకింత తక్కువైనా కేంద్రం నిర్ణయాలకు వత్తాసు పలికే పార్టీలు ఉండటంతో అక్కడా ఆమోదం పొందడం పెద్ద కష్టం కాదు. దీంతో జమిలి ప్రతిపాదన అమలుకు ఇదే మంచి తరుణం అని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుంటే మోడీ సర్కార్ జమిలి విషయంలో అడుగు ముందుకు వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు సైతం జమిలికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతులు ఇస్తున్నాయి. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో జమిలికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన సంగతి విదితమే.  

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.