ఖైరతాబాద్ బరిలో తెలంగాణ రక్షణ సేన: అభ్యర్థి ఎవరంటే.?
Publish Date:Sep 26, 2026
Advertisement
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తధ్యం అని ఖరారైపోయింది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహ రచన, ఎత్తుగడలు, ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ కూడా ఈ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఉపఎన్నికలో తమ అభ్యర్థిని రంగంలోకి దించి పార్టీ సత్తా చాటాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. తొలుత ఖైరతాబాద్ బరిలో కల్వకుంట్ల కవిత దిగుతారని ప్రచారం జరిగినప్పటికీ.. టీఆర్ఎస్ గళాన్ని బలంగా వినిపించేందుకు పోటీలో టీఆర్ఎస్ ఉంటుందనీ, అయితే కవిత అభ్యర్థి కారనీ అంటున్నారు. ప్రణాళికలు రచిస్తోంది. నగర రాజకీయాల్లో తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు ఈ ఎన్నికను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై పోరాడటమే తమ ప్రధాన లక్ష్యమని, అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ ఉపఎన్నిక సరైన వేదిక అని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తామని, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండాగా ఉంటుందని టీఆర్ఎస్ చెబుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం వ్యూహాలు రచిస్తున్న తరుణంలో అనూహ్యంగా టీఆర్ఎస్ కూడా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించడంతో పోటీ రసవత్తరం గా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తరువాత ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక సమస్యలపై డిక్లరేషన్లు ప్రకటించాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్ బరిలోకి దిగడానికి నిర్ణయించుకోవడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికలో చతుర్ముఖ పోటీ అనివార్యం కావడంతో సర్వత్రా ఈ ఎన్నికపై ఆసక్తి ఉత్కంఠ వ్యక్తమౌతోంది.
[Telangana Rakshana Sena, Khairatabad by Eection, Telangana Politics, BRS, Congress, BJP, TRS, Telugu One]
http://www.teluguone.com/news/content/telangana-rakshana-sena-39-232632.html




