Publish Date:Jan 27, 2025
భవిష్యత్ ను ముందే దర్శించడం చంద్రబాబుకు అలవాటే. గతంలో ఐటీ ప్రభంజనాన్ని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ ప్రొఫెషనల్స్ తయారు కావడానికి అవసరమైన విద్యా విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు తెలుగువారు ఐటీ రంగంలో అగ్రగాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే భవిష్యత్ అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంట్లోనూ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్జీజీఎస్)పై సచివాలయంలో సోమవారం (జనవరి 27) సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి ఇంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను విరివిగా వినియోగించుకునేలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్ధంగా వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చని అన్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల పని తీరు మెరుగౌతుందన్న చంద్రబాబు పాలనలో సాంకేతికత వినియోగంద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించగలమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించుకుని పని తీరును మెరుగుపరుచుకోవాలన్నారు.
15 నుంచి 20 శాతం వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పని చేయాలన్నారు. గూగుల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్‌తో తమ డేటాను అనుసంధానం చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి ఆయా ప్రభుత్వ శాఖల్లో అమలు చేయదగ్గ విషయాలను గూగుల్ సంస్థ సూచిస్తుందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా చంద్ర బాబు పేర్కొన్నారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే సదుపా యం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డాటాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగంగా జరుగుతోందని ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినేష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. సేకరించిన డేటా ఆధారంగా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ ను రూపొంది స్తున్నామనీ, అలాగే ప్రభుత్వ డేటాలో లేకుండా ఉన్న పౌరుల డేటాను కూడా కొత్తగా సేకరించామని వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-ai-professional-in-every-house-39-191937.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.