కాంగ్రెస్ కథ మళ్ళీ మొదటికి..

Publish Date:Aug 22, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, అధ్యక్ష పీఠంపై ఎవరు? మూడేళ్లుగా ఇదే ప్రశ్న అప్పుడప్పుడు వినిపిస్తూనే వుంది. అయినా, సమాధానం మాత్రం చిక్కడం లేదు. ఇదిగో అదిగో అంటూనే ఏదో ఒక వంకన పార్టీ సంస్థాగత ఎన్నికలు ఒకటికి రెండు సార్లు వాయిదా పడ్డాయి. అనివార్య పరిస్థితులలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీ మూడేళ్ళుగా ఆపదవిలో కొనసాగుతూ కొత్త రికార్డు సృష్టించారు.  నిజానికి, దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా, మూడేళ్ళకి పైగా పార్టీ  అధ్యక్ష పీఠం ఖాళీగా పెట్టిన పార్టీ కాంగ్రెస్ తప్ప బహుశా మరొకటి ఉండక పోవచ్చును.

రాహుల్ గాంధీ సారధ్యంలో 2019లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి, ఘనంగా ఓడి పోయింది. కాంగ్రెస్, బలం కనీసం మూడంకెల సంఖ్యకు అయినా చేరుతుందని ఆశించినా, హస్తం పార్టీ సంఖ్యా బలం అర్థ శతకం దగ్గరే ఆగిపోయింది. చివరకు పార్టీ అధ్యక్ష హోదాలో పోటీచేసిన రాహుల్ గాంధీ, సొంత నియోజకవర్గం అమేథిలో ఓటమిపాలయ్యారు. ఈ నేపధ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ)కి సూచించారు.అయినాసీడబ్ల్యుసీ కాదంది. రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షునిగా కొనసాగాలని, సీడబ్ల్యుసీ సభ్యులు పట్టుపట్టారు. అయినా రాహుల్ గాంధీ ససేమిరా  అన్నారు. మరోమారు బాధ్యతలు తీసుకునేది లేదని, ఖరాఖండిగా తెగేసి చెప్పారు. 

ఆ పరిస్థితుల్లో అటు రాహుల్ మెట్టు దిగక, ఇటు ఇంకెవరూ ముందుకు రాకపోవడంతో, చివరకు 22 ఏళ్లుగా పార్టీ బాధ్యతలను తన భుజస్కందాలపై మోసిన సోనియా, తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను మరో మారు తమ భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. రాహుల్ గాంధీ  ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఆ బాధ్యతను ఆయనకు అప్పగించి తాను తప్పుకుందామని చూస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా సొనియాగాంధీతో పాటుగా పార్టీ  కూడా రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడు ఊ... అంటారా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. అందుకోసం  అధ్యక్ష ఎన్నికలను ఒకటికి రెంసుసార్లు వాయిదా కూడా వేశారు.

చివరకు, ఆయన ఊ .. అన్నట్లే అని, ఎన్నిక ముహూర్తం ఖరారైన తర్వాత ఉహు .. అనేసి నట్లు సమాచారం. దీంతో, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కథ మళ్ళీ మొదటి కొచ్చిందని అంటున్నారు. 
నిజానికి, ఈ నెల (ఆగష్టు) 21వ తేదీ నుంచి  వచ్చే నెల (సెప్టెంబర్)  20వ తేదీ మధ్యలో, పార్టీ అధ్యక్ష ఎన్నికతో సహా పార్టీ  సంస్థా గత ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ  నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) త్వరలో సమావేశం అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే రాహుల్ గాంధీ, అధ్యక్ష పదవి వద్దే వద్దని మళ్ళీ మొరాయించడంతో ... కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు మరోమారు వాయిదాపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

అయితే, ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 20 లోగా, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ కేంద్ర సంస్థాగత ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఇప్పటికే షెడ్యూలు ఖారారు చేసి. సీడబ్ల్యుసీ ఆమోదం కోసం పంపామని చెప్పారు. సీడబ్ల్యుసీ  ఆమోదం తెలిపిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.  మరో వంక, సోనియా గాంధీ వయసు, ఆరోగ్య దృష్టా ఇంకా పదవిలో కొనసాగే అవకాశం లేదని, అందుకు ఆమె ఏ  మాత్రం సుమఖంగా లేరని, సో .. రాహుల్ గాంధీ కూడా కాదంటే, ప్రియాంక వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీహెచ్ హనుమంతరావు వంటి, గాంధీనెహ్రు కుటుంబ బంట్లు, ఇప్పటికే రాహుల్ కాదంటే ప్రియాంకకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

అయితే, ఈ సంవత్సరం ఆరంభంలో  జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రియాంక సారధ్యం  వహించినా ఫలితం లేక పోయిందని అంటున్నారు. అంతకు ముందు 17 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు పడిపోయిందని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రియాంక సంవత్సరం పైగా యూపీలోనే ఉండి కష్టపడినా, కనీస పాటి ప్రభావం చూపలేని ఆమెకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అప్పగిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. మరో వంక  ఆమె భర్త రాబర్ట్ వాద్రా  అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు ఎదుర్కుంటున్న నేపధ్యంలో ప్రియాంకకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం వలన కొత్త చిక్కులు ఎదురవుతాయని  కొందరు సందేహం వ్యక్త పరుస్తున్నారు.  

అంతే కాకుండా, కుటుంబ వెలుపలి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, కుమారి శైలజ, ముకుల్ వాస్నిక్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, బయటి వ్యక్తికీ పార్టీ పగ్గాలు అప్పగించడం సోనియా గాంధీకి సుతరామూ ఇష్టం లేదని, చివరకు ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అంత సుముఖంగా లేరని అంటున్నారు.

అయితే, కాదు.. కూడదు అంటే రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించనున్న 'భారత్ జోడో యాత్ర'ను సాకుగా చూపి, ఐదు నెలల పాటు సాగే యాత్ర ముగిసే వరకు ఎన్నికలు వాయిదా వేసినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకంటే, పార్టీ అధ్యక్ష ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి క్లిష్టంగా మారినట్లుందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా, రాహుల్ గాంధీ సూచించినట్లు కుటుంబం వెలుపలి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే దీర్ఘ కాలంలో పార్టీకి మేలు జరుగుతుందని కూడా పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.