ఓణం పండుగ విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి? 

Publish Date:Aug 21, 2021

Advertisement

ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ. మలయళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు – సెప్టెంబర్) వస్తుంది. మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రవణా నక్షత్రమును మలయాళమున "తిరువోణము" అంటారు. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు. ఓణం ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది. 

ఇది కేరళ యొక్క ఆచారములు , సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు , భోజనం , సర్పాకారపు పడవ పందెములు , కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు , ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు.  మగవారు ఒక చొక్కా , ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను , స్త్రీలు ముండు , నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ , రవికె ధరిస్తారు. 

ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ , వర్షపు పువ్వుల పండుగ , పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది. 

చరిత్ర ప్రకారం , మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా , సిరిసంపదలతో ఉన్నారు , ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితో పాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ , మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి , తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు. మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు.  ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు , తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు 

కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో , ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది , ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు. 

 ఓణంలో ఆకట్టుకునే మరోక ముఖ్య విశేషం  వల్లంకలి  అనబడే సర్పాకారపు పడవల పందెము , ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ , అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. 

ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది , ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు , కయ్యంకలి , అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో , పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి , తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి , పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి.

ఓనక్కోడిగా పిలవబడే ఆ రోజున ధరించే కొత్త దుస్తులు , ఓణం సద్య , అని పిలవబడే విస్తారమైన విందు ఓణం ప్రత్యేకతలు. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపైన అన్నముతో పాటు కనీసం నాలుగు రకముల పదార్ధములు వడ్డించబడతాయి. సాంప్రదాయక ఊరగాయలు , అప్పడములు కూడా వడ్డిస్తారు. పాలు , చక్కెరతో చేసిన 'పాయసం' సాధారణంగా వడ్డించబడుతుంది. దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా ఉంటాయి. ఓణం సమయంలో , ప్రజలు వారి ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులతో రంగవల్లులు అలంకరిస్తారు , దీనిని పూక్కలం అంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు పువ్వులను సేకరించి వాటిని పెద్ద పెద్ద ఆకృతులలో అలంకరించే పని అప్పగించబడుతుంది. ఈ పూల ఆకృతులను తయారుచేయటానికి ఓణం రోజు పోటీలు జరుగుతాయి. ఇది సాధారణంగా 1.5 మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటాయి. ఈ ఆకృతిలో భాగంగా సాధారణంగా ఒక దీపం ఉంచుతారు. ఇటీవలి కాలంలో , ఈ పువ్వుల ఆకృతులు సాంప్రదాయక వృత్తాకారముల నుండి కేరళ ప్రజల జీవితాల యొక్క సాంస్కృతిక , సామాజిక విషయములను ప్రతిబింబిస్తూ విలక్షణమైన ఆకృతులుగా పరిణామం చెందాయి.

వల్లంకలి (సర్పాకార పడవ పందెము) ఓణం సమయంలో జరిగే మరియొక ముఖ్యమైన కార్యక్రమం. వీటిలో అరంముల బోటు రేసు , నెహ్రూ ట్రోఫీ బోటు రేసు ప్రముఖమైనవి. దాదాపు 100 మంది పడవవాండ్లు అతి పెద్దవి , అందమైన సర్పాకార పడవలు నడుపుతూ ఉంటారు , ఆ నీటిపైన పయనించే సర్పాకార పడవలను వీక్షించటానికి సమీప ప్రాంతముల నుండి , దూర ప్రాంతముల నుండి స్త్రీలు , పురుషులు వస్తారు. వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేశుని బొమ్మలను ప్రతిష్ఠించినట్లుగా ఓణం సమయంలో , కేరళలోని హిందువులు త్రిక్కకర అప్పన్ (వామనుని రూపంలో ఉన్న విష్ణువు) మూర్తిని తమ ఇళ్ళలో ప్రతిష్ఠిస్తారు. 

కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవటంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఓణం పండుగ హిందూమతం నుండి ఉద్భవించి దానితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ , ఈనాడు ఈ పండుగను హిందువులు , ముస్లిములు , క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో జరుపుకుంటున్నారు. ఈ వేడుక సమయంలో కేరళలోని హిందూ దేవాలయములలో అనేక దీపములు వెలిగించబడతాయి. దేవాలయముల ఎదుట ఒక తాటి చెట్టును నిలబెట్టి దాని చుట్టూ కొయ్య దుంగలను నిలబెట్టి ఎండు తాటి ఆకులతో కప్పుతారు. త్యాగము చేసి మహాబలి నరకమునకు వెళ్ళిన దానికి గుర్తుగా ఒక కాగడాతో దీనిని వెలిగించి బూడిద చేస్తారు.

By
en-us Political News

  
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 
కరోనా టీకా కోవీషీల్డ్ వ్యవహారం ఎలా వుందంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా వుంది.
మాజీ ప్ర‌ధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి
బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.
పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది. 
బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులే అల్ల‌రి మూక‌ల‌కు అప్ప‌గిస్తే ఫ‌లితం ఎలా వుంటుందో మ‌ణిపూర్ మ‌హిళ‌ల అత్యాచార సంఘ‌ట‌న అద్దం ప‌డుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జి షీటులో సీబీఐ కొందరు పోలీసుల పేర్లను చేర్చింది. బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల ముందు వదిలిపెట్టారని సీబీఐ పేర్కొంది. గతేడాది మే 4న కుకీ, మెయితీల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దాఖ‌లు చేసిన చార్జి షీట్‌లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.