ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో జోగినుల ఆందోళన కలకలం రేపింది. జోగిని శ్యామల అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో తోపులాట జరిగి ఆమె చేతిలోని బోనం కింద పడింది. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన జోగిని శ్యామల.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ ఘటనపై జోగినులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.
జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదనీ, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని జోగినులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు నిరసనగా జోగినులు తాము తీసుకొచ్చిన బోనాలను కూడా ఆలయంలోకి తీసుకెళ్లకుండా ఆలయ ద్వారం వద్దే ఉంచి సమర్పించారు. ఈ సందర్భంగా జోగినులు తమకు జరిగిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జోగినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.
ఆవేదనతో ఆలయ ద్వారం వద్దే కొంతసేపు నిరసన కొనసాగించారు. అనంతరం అమ్మవారి ఆలయం వైపు వెన్నుతిరిగి తమ నిరసనను వ్యక్తం చేశారు.జాతరలో భక్తుల రద్దీ మధ్య జోగినులు ఒక్కసారిగా ధర్నాకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Joginis hurl curses at the government, Jogini Syamala, Bonam, Felldown, Stampde, Ujjaini Mahankali Jathara
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/oginis-hurl-curses-at-the-government-36-227845.html
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
అదృష్టం అనేది ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటలీలో ఒక మహిళను వరించిన భారీ అదృష్టం క్షణాల్లో చేజారిపోయినట్లే కనిపించినా, చివరికి అనూహ్య రీతిలో ఆమె వద్దకే చేరింది.
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్ చెక్ పెట్టాయి.
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్‌లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పిరాన్, ఏలియన్‌వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్‌ను, 70% మంది ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.