జోగి రమేష్ ఏ మాత్రం క్రెడిబులిటీ లేని వ్యక్తి.!

Publish Date:Jul 29, 2026

Advertisement

తెలుగువన్ ప్రత్యేకం

వైసీపీ  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి, రాజధాని అమరావతిపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై మైలవరం తెలుగుదేశం   ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వన్ న్యస్ చానల్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో  ఆయన  కుట్రలతో అమరావతిని చెడగొట్టాలని చూసేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

గతంలో  వైపీపీలో  తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ వివరంగా వెల్లడించారు. ఆ పార్టీలో ఉండలేని పరిస్థితులు తలెత్తడం వల్లే తాను బయటకు వచ్చి, తన మద్దతుదారులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తెలుగుదేశం పార్టీలో  చేరానన్నారు.  పారిశ్రామిక రంగానికి రావాల్సిన రాయితీలు, నిధుల విడుదల విషయంలో నాలుగేళ్లపాటు జగన్ ప్రభుత్వం  నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.

మాజీ మంత్రి జోగి రమేష్  తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో తమకు కావలసిన కొందరికే నిధులు, రాయితీలు విడుదల చేశారన్నారు. ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సైతం జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడు నెలల కాలపరిమితి పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ మోసం చేశారని స్పష్టం చేశారు.

రాజధాని అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు, ఆలోచనలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించే కుట్రలతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు.

 అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని. జగన్   కాదు..  ఎవరు దిగివచ్చినా అమరావతిని మార్చడం సాధ్యపడే విషయం కాదని స్పష్టం చేశారు.   ఒక నగరం అభివృద్ధి చెందే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని, దానిని సహించలేక కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు రగల్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

బోగస్ హామీలు, రాజకీయ నాటకాలడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవారు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.  రాబోయే రోజుల్లో ఓటు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తును నిర్మించే కీలక నిర్ణయమని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రతి వేదికపైనా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వసంత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారని, ఇకపై అభివృద్ధి నిరోధక రాజకీయాలకు ఏపీలో తావులేదని పునరుద్ఘాటించారు.

Vasantha Krishna Prasad Interview, Mylavaram MLA Vasantha, YS Jagan Amaravati Comments, Jogi Ramesh Vasantha Krishna Prasad

By
en-us Political News

  
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.