వైసీపీ హయాంలో పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు!

Publish Date:Jun 19, 2026

Advertisement

గత వైసీపీ  హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో మెరిట్ విద్యార్థులకు ఘోర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత మార్కులు సాధించి, టాప్ ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులను పక్కనబెట్టి.. కేవలం వైసీపీ కార్యకర్త అన్న అర్హత చూసి ఉద్యోగాలు కట్టబెట్టారని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది నిరుద్యోగులు ఈ పరీక్షలు రాయగా, అందులో లక్షా పాతిక వేల మందికి నియామకాలు జరిగాయి.

అయితే, ఈ ప్రక్రియలో అత్యంత తీవ్రమైన అక్రమాలు చోటుచేసుకున్నాయనే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ విషయంపై వాస్తవవేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్ లో విశ్లేషణాత్మక చర్చ జరిపారు.  సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ,   8000 దాటి ఆ పైన   దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.  దీనిపై అప్పట్లో నిరుద్యోగులు ప్రశ్నించగా,  మేము నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం కానీ,  మీకే ఇస్తామని చెప్పలేదు కదా! మా వాళ్లకు మేము ఇచ్చుకుంటున్నాం, గెటౌట్  అంటూ ఒక అప్పటి   మంత్రి ఒకరు నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పినట్లు బాధితులు వాపోతున్నారన్నారు. 

అలాగే అప్పటి నియామకాల్లో   దివ్యాంగుల కోటాలో భారీ అక్రమాలు జరిగాయనీ, తన పరిశీలనలో ఈ విషయం తేటతెల్లైందనీ రవిశంకర్ అన్నారు.   కృష్ణా, శ్రీకాకుళం లాంటి పలు జిల్లాల్లో దివ్యాంగుల కోటాలో  ఉద్యోగాలు పొందిన వారంతా కేవలం  హియరింగ్ ఇంపైర్డ్  అంటే (వినికిడి లోపం ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించిన వారేనన్నారు.  కేవలం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించుకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలకే ఈ పోస్టులు కట్టబెట్టారనే బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. 

వ్యవస్థలో వేళ్లు ఊనుకుపోయిన ఈ రాజకీయ నియామకాల వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి  పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సచివాలయ సిబ్బంది అంతా  వైసీపీకి అనుకూలంగా ఉండటం వల్ల..  ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదనే అసంతృప్తి ప్రజలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు.   తెలుగుదేశం  కేడర్‌లోనూ   అసంతృప్తి వ్యక్తమవుతోందని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.  క్షేత్రస్థాయి వాస్తవాలను, కార్యకర్తల గళాన్ని పట్టించుకోకుండా.. కార్పొరేట్ వ్యూహకర్తలపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరిదిద్దలేకపోతున్నారని చెప్పారు. 

  అర్హత ఉండి వీధిన పడ్డ 17 లక్షల మందికి పైగా అభ్యర్థులకు న్యాయం చేయాలంటే, గతంలో జరిగిన సచివాలయ నియామక ప్రక్రియ మొత్తాన్ని రీఓపెన్ చేసి సమగ్ర విచారణ జరపాలన్నారు.  అక్రమంగా సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాల్లో చేరిన వారిని తొలగించి, నిజమైన మెరిట్ అభ్యర్థులకు అవకాశం కల్పించకపోతే భవిష్యత్తులో ప్రభుతం  నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని రవిశంకర్, డోలేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

By
en-us Political News

  
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.