కాంగ్రెస్ లక్ష్యం.. .జెన్ జీ భాగస్వామ్యంతో ముందుకెడతాం.. టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత

Publish Date:May 2, 2026

Advertisement

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నుంచి బయటకు వచ్చి సొంత రాజకీయ వేదికను టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న   కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్నిప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె..  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే   ప్రధాన ధ్యేయమన్నారు.  ఈ పోరాటంలో జెన్-జీగా పిలువబడే నేటి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత  ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పంథాను మార్చుకోబోతున్నట్లు వెల్లడించారు.

కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతరం ఆలోచనలు, వారి అవసరాలు గతానికి భిన్నంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. స్క్రీన్లపై సమయం గడుపుతున్నారని యువతను విమర్శించే బదులు.. అదే డిజిటల్ వేదికలను వారి గొంతుకగా మార్చుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని..  అందుకే ఆ పార్టీని ఓడించేందుకు యువశక్తిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

రాజకీయాల్లో యువత  కేవలం ఓటర్లుగానే కాకుండా, నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత చెప్పారు. తన పార్టీలో జెన్-జీ ప్రతినిధులకు పెద్దపీట వేస్తానని..  సమాజంలో వెనుకబడిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, విద్యా సంబంధిత సమస్యలపై పోరాటమే తన అజెండా  అన్న కవిత.. రాష్ట్రంలో  రేవంత్ సర్కార్   వైఫల్యాలను ఎండగట్టడంలో యువతే ముందువరుసలో ఉంటారని  విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  జారీ చేసిన నోటిఫికేషన్లలో వయోపరిమితి సడలింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జీవో 30ని యథాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. 

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ, తెలంగాణ సెంటిమెంట్‌ను, యువత ఆకాంక్షలను కలగలిపి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.