రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సూచనలు, ప్రతిపాదనలకు ఆహ్వానం.!

Publish Date:Jul 9, 2026

Advertisement

వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చింది.. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండకు బోడి గుండు కొట్టించి మరీ నిర్మించని రుషికొండ ప్యాలెస్ వినియోగం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  వైసీపీ సర్కార్ సకల పర్యావరణ నిబంధనలనూ తుంగలోకి తొక్కి మరీ నిర్మించిన ఈ ప్యాలెస్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

గత కొంతకాలంగా ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ రుషికొండ ప్యాలెస్ విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  కీలకమైన ప్రకటన చేసింది. ఈ  విలాసవంతమైన భవనాలను ఇప్పటివరకు అధికారికంగా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేసింది.   రుషికొండ ప్యాలెస్,  అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా మూడో పక్షానికి లీజుకు ఇవ్వకుండా చూడాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై న్యాయస్థానంలో  విచారణ సందర్భంగా  ప్రభుత్వ లీజు వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది, ఈ భవనాల వినియోగానికి సంబంధించి ఆసక్తి ఉన్న వివిధ ప్రైవేట్ సంస్థల నుండి ఏపీటీడీసీ ప్రతిపాదనలను ఆహ్వానించిందని చెప్పారు.  అయితే ఆ ప్రతిపాదనలన్నింటినీ మొదట మంత్రివర్గ ఉపసంఘం క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఆ సబ్‌కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు ఎలాంటి కేటాయింపులు జరగవని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది. 

 వైసీపీ  ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ  భవనాల విషయంలో పర్యావరణ నియమాలను, తీరప్రాంత నియంత్రణ మండలి సీఆర్‌జడ్  నిబంధనల   ఉల్లంఘన జరిగిందన్న  ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ..  2021లోనే తెలుగుదేశం   ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సహా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ కొండను తవ్వేసి నిర్మించారంటూ పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు కూడా జరిగాయి. ఈ వివాదాల నేపథ్యంలో, కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తులు వృథా కాకుండా, పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏపీటీడీసీ ఈ ఏడాది జూన్ 24న   ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం  మోడల్, ఎకో టూరిజం ప్రాజెక్టులు ,  అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ వెంచర్ల వంటి సృజనాత్మక అంశాలపై నిపుణులు, సంస్థల నుంచి తగిన సూచనలు, ప్రతిపాదనలను ఆహ్వానించింది. 

Rushikonda Buildings, AP Tourism, Visakhapatnam, APTDC Proposals, AP High Court

By
en-us Political News

  
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు తెలిపిన నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తనపై ఎలాంటి బలమైన ఆధారాలు లేవని పేర్కొన్న కాదంబరి జెత్వానీ.. ఫిర్యాదుదారుడి నుంచి తన బ్యాంకు ఖాతాలోకి వచ్చిన సుమారు రూ.4.5 లక్షలు తాను చేసిన పనికి సంబంధించిన చెల్లింపులు, బహుమతులు మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే కాల్ రికార్డులు, సందేశాలు కేవలం మాట్లాడుకున్న విషయాన్ని మాత్రమే చూపుతాయనీ.. అవి నేరానికి ఆధారాలు కావని స్పష్టం చేశారు.
తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని అమితాబ్ స్వయంగా చెప్పారు. అయితే అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై అందరిలో ఆందోళన వ్యక్తం కావడానికి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్టే కారణమైంది.
వివాదం ముదరకుండా.. అరెస్టు చేసిన కళాకారుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అక్కడితో ఆగకుండా.. తేరుకురల్ అరివును సచివాలయానికి ఆహ్వానించి ఆయనతో మాట్లాడారు.
తెలంగాణ ట్రాన్స్‌కో లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీఈ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముత్యం వెంకటరమణ ఇల్లు, కార్యాలయం, ఆయన అత్యంత సన్నిహితుల నివాసాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు.
డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం! 1985 టిడబ్ల్యూఏ ఫ్లైట్ హైజాక్ తర్వాత నిలిచిపోయిన అమెరికా లెబనాన్ డైరెక్ట్ విమాన సర్వీసులు 40 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి. వైట్‌హౌస్‌లో లెబనాన్ అధ్యక్షుడితో భేటీ అనంతరం ట్రంప్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
దర్యాప్తు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో సీఆర్పీసీ క్వాషింగ్ పిటిషన్ల ద్వారా కోర్టులు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లకు పోలీసుల అరెస్ట్ పట్ల నిజంగానే భయం లేదా ఆందోళన ఉంటే, వారు చట్టబద్ధంగా యాంటిసిపేటరీ బెయిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది.
నేకేడ్ మోల్ రాట్ రాణులు తమ సామ్రాజ్యాన్ని శారీరక హింసతో కాకుండా ఐసోప్రొపైల్ మైరిస్టేట్ అనే ప్రత్యేక సువాసన రసాయనంతో ఎలా అదుపులో ఉంచుకుంటాయో నేచర్ పత్రిక పరిశోధనా వివరాలతో తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో CAISI సెంటర్ ఫర్ ఏఐ స్టాండర్డ్స్ అండ్ ఇన్నోవేషన్ హెడ్ క్రిస్ ఫాల్ బాధ్యతలు చేపట్టిన కేవలం 3 నెలల్లోనే రాజీనామా చేశారు. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ మోడల్స్ పరీక్షించే ఈ ఏజెన్సీలో చోటుచేసుకున్న ఈ సంచలన పరిణామం మరియు దాని వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇవే!
క్రీ.శ 79లో విసూవియస్ అగ్నిపర్వత విపత్తును తట్టుకుని పాంపీ నగర వాసులు ఎలా బతికి బయటపడ్డారో తెలుసుకోండి. హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్‌స్టన్ సమర్పించిన పాంపీ: అవుట్ ఆఫ్ టైమ్ డాక్యుమెంటరీ విశేషాలు మరియు కొత్త చారిత్రక ఆధారాలు ఇక్కడ చదవండి.
పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు చమురు సరఫరా ఆందోళనలతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 238 పాయింట్లు పతనం కాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
గత 24 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హర్యానా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ వాంగ్చుక్ ను మేందాంత ఆస్పత్రికి తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.