వ్యాక్సిన్ వచ్చింది కరోనా తెచ్చింది
Publish Date:Dec 31, 2020
Advertisement
ప్రపంచం అంతా ఆశగా ఎదురుచూసిన వ్యాక్సిన్ వచ్చింది అని సంబర పడినంత సేపు పట్టలేదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు వస్తున్న దుష్పరిణామాలు చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ కి పాజిటివ్ రావడం ఏమిటి అన్న సందేహాలు కలుగుతున్నాయి. అసలు వ్యాక్సిన్ పని చేస్తుందా? పరిణామాలు ఎలా ఉంటాయి? అన్న అనుమానం కలుగుతోంది. అసలు వ్యాక్సిన్లు సత్ఫాలితాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అంటే నిపుణలు మాత్రం పెద్దగా ఉపయోగ పడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇంకొందరు భారత్ లో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు పోలియో నిరోధానికి వాడే వ్యాక్సిన్ కొంత మేర సత్ఫాలితాలు ఇచ్చినా, కుక్క కాటుకి ఇచ్చిన వ్యాక్సిన్ పెద్దగా ఉపయోగా పడలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కుక్క కాటుకు గురైన వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చినా చనిపోయిన సందర్భాలు ఉన్నాయని నిపుణులు తేల్చి చెప్పారు. సర్విక్స్ కాన్సర్ కు ఇచ్చే వ్యాక్సిన్ వల్ల ప్రజలు ఏ మేరకు ప్రయోజనం పొందారు అన్నది నేటికీ మనదగ్గర సరైన స్టాటిస్టిక్జ్స్ లేవు. వ్యాక్సిన్ తయారీలో ముఖ్యంగా క్లినికల్ ట్రయల్స్ లో వచ్చిన ఫలితాలకు, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? అన్న అంశాలు ఏమిటి? సైడ్ ఎఫెక్ట్స్ కు ప్రత్యామ్నాయంగా వాడిన ఇతర ఔషదాలు ఏమిటి? ఆ రిపోర్ట్ ఏమిటి? వాటి ఆధారంగానే వ్యాక్సిన్ తాయారు చేసారా? ఆలా తయారైన వ్యాక్సిన్ కరోనా లక్షణాలు లేని నర్స్ టీకా తీసుకున్నాక కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది? అంటే ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లు అన్ని ఒకలాగే ఉంటాయా? అన్న సందేహం వ్యక్తమౌతుంది? అసలు వ్యాక్సిన్ లో ఉన్న ఔషధం ఏమిటి అంటే? అది గోప్యంగా ఉంచుతున్నారు. ఇటీవలి కాలంలో దీర్ఘ కాలంగా ఎదురౌతున్న అనారోగ్యానికి, ఇన్ఫెక్షన్ నివారణకు ఇచ్చే మందు స్టెరాయిడ్స్. అయితే ఆది డాక్టర్ నిర్దేశించిన డోస్ మేరకు స్టెరాయిడ్స్ వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చర్మం పై దద్దుర్లు రావడం వంటి సమస్యలు వస్తాయి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అసలు వ్యాక్సిన్ లో స్టెరాయిడ్స్ ఉన్నాయా? వాటి మోతాదు ఎక్కువ అయితే వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి? అని ఊహిస్తేనే సామాన్యులను భయానికి గురి చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి జ్వరం రావడం సహజమని, సమస్యలు వస్తాయని మొదటి డోస్ తో కరోనా పై పని చేయదని రెండు, మూడు డోస్ లు తీసుకోవాలంటూ చేస్తున్న ప్రకటనలో నిజం ఎంత ఉందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు కొత్త కరోనా స్ట్రెయిన్ పై ఈ వ్యాక్సిన్ లు ఎంతవరకు సమర్ధవంతంగా పనిచేయగలవు? అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా కరోనా వ్యాక్సిన్ ప్రయోగానికి ముందే అవగాహన కల్పించాలి అని సామాన్యుడు కోరుతున్నాడు.
http://www.teluguone.com/news/content/nurse-tests-covid-positive-week-after-receiving-vaccine-39-108369.html





