జగన్ సర్కార్‌కు మంద బలమే మహాశాపం కానుందా?

Publish Date:Mar 22, 2022

Advertisement

రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. అవును. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు చూస్తే, అది నిజమే అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏదో ఉద్దరిస్తారని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే, ఇప్పుడు, ఆ భారీ మెజారిటీనే, వైసీపీ పాలిట యమపాశంలా మారిందనే మాట పార్టీలోనే ప్రముఖంగా వినిపిస్తోంది. 

అధికారంలోకి వచ్చింది మొదలు జగన్ రెడ్డి ప్రభుతం  రాజకీయ ప్రత్యర్ధులు లక్ష్యంగా భౌతిక దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తూస్తునే ఉన్నాయి.తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద వరస దాడులు చేయడం మొదలు అసెంబ్లీలో అహంకార ప్రదర్శనల వరకు అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ప్రజల్లో తలెత్తుకునే పరిస్థితి లేకుండాచేస్తోందని, వైసీపీ అభిమానులు, క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలు, ఛీ’ తప్పుచేశామని వాపోతున్నారంటే పరిస్థతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చును అంటున్నారు.  

ముఖ్యంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు,మాట్లాడే పద్దతి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, సామాన్యుల మొదలు మేథావుల వరకు ప్రతి ఒక్కరు జగన్ రెడ్డి ప్రభుత్వం తీరును సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతూ, అదేమంటే, సభ్యులను సస్పెండ్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, దున్నపోతు మీద వడగళ్ళ వాన అన్న చందంగా, ప్రభుత్వం మాత్రం అదే ధోరణి కొనసాగిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ల పర్వం కొనసాగిస్తోంది. 

బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు నుంచి, ప్రభుత్వం సభలో తమకున్నమెజారిటీని అడ్డుపెట్టుకుని, అయినదానికి కాని దానికీ, తెలుగు దేశం సభ్యులను స్పీకర్ సాయంతో సస్పెండ్ చేయడం సర్వసాధారణమవుతోందనే విమ‌ర్శ ఉంది. స‌భ‌లో జంగారెడ్డిగూడెం నాటు సారా మరణాలతో పాటు పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్,టీడీపీ ఎమ్మెల్యేల్లో బెందాళం అశోక్, రామరాజు, సత్యప్రసాద్‌, రామకృష్ణలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.   సభకు పదేపదే ఆటంకం కలిగించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. నిజానికి, ప్రజల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ప్రతిపక్ష సభ్యులు ప్రధమ కర్తవ్యం. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం,ప్రజల సమస్యలు వదిలి, పెగాసస్ స్పైవేర్ విషయాన్ని పైకి తెచ్చి రాద్దాంతం చేయడంతో గత నాలుగైదు రోజులుగా సభ కార్యక్రమాలు ఏక పక్షంగా సాగుతున్నాయని అంటున్నారు. 

ఇక పెగాసస్ స్పైవేర్’  విషయానికి వస్తే, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యఆధారంగా,  వైసీపీ ప్రభుత్వం సభాసంఘం విచారణ వరకు వెళ్ళడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట తప్ప మరొకటి కాదని అంటున్నారు. అంతే కాదు, మరో ఆధారం ఏదీ లేకుండా, కేవలం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన, అస్పష్ట, నిరాధార వ్యాఖ్య ఆధారంగా ప్రభుత్వం దూకుడు చూపడం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం బూమ్రాంగ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
నిజానికి  పెగాసస్ స్పైవేర్’ను ప్రభుత్వాలు తప్ప ఎవరంటే వారు కొనుగులు చేయడం అయ్యే పని కాదు. అంతే కాకుండా, పెగాసస్ స్పైవేర్’ కొనడం నేరం కాదు. దుర్వినియోగం చేస్తేనే, అది నేరం అవుతుంది. అలాంటిది ఏదైనా ఉందనే అనుమానం ఉంటే ప్రభుత్వం, ఏసీబీ, సీఐడీ లేదా సీబీపీ విచారణకు ఆదేశించవలసింది. కాదంటే,సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీని నివేదించ వలసింది, అవేవీ కాకుండా, అధికార పార్టీ సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండే సభా సంఘం ఏర్పాటు చేసిందంటే, రాజకీయ రచ్చ చేసేందుకే అని వేరే చెప్ప నక్కర లేదని నిపుణులు అంటున్నారు.

ఈ విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం సభలో ఉన్న బలాన్ని అడ్డుపెట్టుకుని,  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేశారని చెప్తున్న ఆరోపణలే ఆధారంగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు మరోమారు తెరతీసిందంటున్నారు. అయితే, మమతా బెనర్జీ తమ వ్యాఖ్యలకు ఎంత వరకు కట్టుబడి ఉంటారు. ఎంతవర‌కు ఆధారాలు చూపగలుగుతారు అనేది అనుమానమే. అదే జరిగితే, ఇప్పటికే అధికార, సంఖ్యా బలంతో అప్రజాస్వామిక  నిర్ణయాలతో అభాసుపలుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం  మరింత అభాసు పాలవుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.