వదల బొమ్మాలీ.. నిన్నొదల.. జగన్ ను వెంటాడుతున్న నంబర్ 11

Publish Date:Mar 25, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డిని  2024 ఎన్నికల తరువాత నుంచీ  నెటిజనులు లెవ‌న్ రెడ్డి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చేరింది.   కారణం తెలిసిందే కదా.. 2024 ఎన్నికలలో ఆయన పార్టీ సాధించిన స్థానాల సంఖ్య 11 కావడంతో ఆ సంఖ్య పేరుతోనే వైసీపీ అధినేతనూ, ఆ పార్టీని నెటిజనులు ఓ ఆటాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీయులకు నంబర్ 11 ఒక పీడకలలా తయారైంది.  ఇక ఆయన వ్యతిరేకులైతే జగనాసుర, లెవనాసురా అంటూ కూడా ఎద్దేవా చేస్తుండటం కద్దు.  

 అంతే కాదు జగన్ తన ఎమ్మెల్యేలతో ఇలా అసెంబ్లీకి హాజరై అలా వాకౌట్ చేసిన సందర్భంలో  స్పీక‌ర్ అయ్య‌న్న  పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. ప‌ద‌కొండు మంది  ఎమ్మెల్యేల‌తో వ‌చ్చిన జ‌గ‌న్ 11 నిమిషాల  11 సెక‌న్లు మాత్ర‌మే ఉండి వెళ్లడంతోనే  స్పీక‌ర్ ఈ కామెంట్ చేశారు.  అలాగే గతంలో ఓసినిమా ఫంక్షన్ లో నటుడు పృధ్వీ  ప‌ద‌కొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ వైసీపీయులు జీర్ణించుకోలేకపోయారు.  ఇందుకు కారణం 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన పార్టీ శ్రేణులకూ గిట్టదు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా.. వైసీపీయులకు 11 నంబర్ కనిపించినా, వినిపించినా   జగన్ ను  ఉద్దేశించే అని ఉలిక్కిపడుతుంటారు.  ఉడుక్కుంటుంటారు.  అంతెందుకు గతంలో ఆయ‌న జైల్లో ఉన్న కాలాన్ని కూడా ప‌ద‌కొండుకు ముడిపెట్టి  నెటిజనులు సెటైర్లు వేస్తున్నారంటే వైసీపీ అండ్ కోను నంబర్ 11 ఎలా వెంటాడుతోందో, ఏడిపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే..  ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్  చేస్తున్నది. ఎలా అంటే ఇప్పటి వరకూ  సీబీఐ ఆయ‌న‌పై వేసిన ఛార్జి  షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయ‌న ఏవ‌న్ నిందితుడు.  ఏ అంటే  న్యూమ‌రాల‌జీ  ప్ర‌కారం ఒక‌టి. వ‌న్ అంటే ఒక‌టి. ఈ రెండింటినీ ప‌క్క ప‌క్క‌న పెట్టి చూసినా ప‌ద‌కొండే  వ‌స్తుంద‌ని జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు కూడా.  అలాగే అప్పట్లో జ‌గ‌న్ వ‌రుస‌గా  11 శుక్ర‌వారాలు ర్టుకు హాజ‌రైన సంగతీ ఆయనపై ట్రోలింగ్ కు దోహదపడింది.  అంతెందుకు ఇటీవలి కాలం వరకూ   వైసీపీ  రాజ్య‌స‌భ స‌భ్యుల సంఖ్య కూడా 11 ఉండేది.   కొంద‌రు రిజైన్ చేయ‌డంతో ఆ సంఖ్య‌లో మార్పు వ‌చ్చింది. అది వేరే సంగతి.   అలాగే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, ప‌ద‌కొండవ నెంబ‌ర్ ఆయ‌న్ను వదల కుండా వెంటాడింది. వెంటాడుతోంది.   

 జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి  చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్   లెవ‌న్ అనే  పేరు మీద   మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా  కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా  11వ నెంబర్  రూమే. పార్లమెంటులో మొదటి అంతస్తులోని 11వ నంబర్ రూమ్ ను స్పీకర్ కేటాయించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైసీపీ ఎంపీలు ఆ రూమ్ ను ఆక్యుపై చేయడానికి   నిరాకరించారు. మూకుమ్మడిగా స్పీకర్ ను కలిసిన వారు ఆ రూమ్ తమకు వద్దనీ, మరో రూమ్ కేటాయించాలంటూ కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకున్నారు. వారి వినతులను మన్నించి స్పీకర్ వారికి 11వ నంబర్ రూమ్ ను మార్చి 12వ నెంబర్ రూమ్ ను కేటాయించారు.  దీంతో 11 నంబర్ జగన్ ను వదల బొమ్మాలీ నిన్నొదల అన్నట్లు వెంటాడుతోందని నెటిజనులు నెట్టింట సెటైర్లు గుప్పిస్తున్నారు. 

By
en-us Political News

  
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.