Publish Date:Mar 25, 2026
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డిని 2024 ఎన్నికల తరువాత నుంచీ నెటిజనులు లెవన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చేరింది. కారణం తెలిసిందే కదా.. 2024 ఎన్నికలలో ఆయన పార్టీ సాధించిన స్థానాల సంఖ్య 11 కావడంతో ఆ సంఖ్య పేరుతోనే వైసీపీ అధినేతనూ, ఆ పార్టీని నెటిజనులు ఓ ఆటాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీయులకు నంబర్ 11 ఒక పీడకలలా తయారైంది. ఇక ఆయన వ్యతిరేకులైతే జగనాసుర, లెవనాసురా అంటూ కూడా ఎద్దేవా చేస్తుండటం కద్దు.
అంతే కాదు జగన్ తన ఎమ్మెల్యేలతో ఇలా అసెంబ్లీకి హాజరై అలా వాకౌట్ చేసిన సందర్భంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. పదకొండు మంది ఎమ్మెల్యేలతో వచ్చిన జగన్ 11 నిమిషాల 11 సెకన్లు మాత్రమే ఉండి వెళ్లడంతోనే స్పీకర్ ఈ కామెంట్ చేశారు. అలాగే గతంలో ఓసినిమా ఫంక్షన్ లో నటుడు పృధ్వీ పదకొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ వైసీపీయులు జీర్ణించుకోలేకపోయారు. ఇందుకు కారణం 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన పార్టీ శ్రేణులకూ గిట్టదు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా.. వైసీపీయులకు 11 నంబర్ కనిపించినా, వినిపించినా జగన్ ను ఉద్దేశించే అని ఉలిక్కిపడుతుంటారు. ఉడుక్కుంటుంటారు. అంతెందుకు గతంలో ఆయన జైల్లో ఉన్న కాలాన్ని కూడా పదకొండుకు ముడిపెట్టి నెటిజనులు సెటైర్లు వేస్తున్నారంటే వైసీపీ అండ్ కోను నంబర్ 11 ఎలా వెంటాడుతోందో, ఏడిపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే.. ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్ చేస్తున్నది. ఎలా అంటే ఇప్పటి వరకూ సీబీఐ ఆయనపై వేసిన ఛార్జి షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయన ఏవన్ నిందితుడు. ఏ అంటే న్యూమరాలజీ ప్రకారం ఒకటి. వన్ అంటే ఒకటి. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూసినా పదకొండే వస్తుందని జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు కూడా. అలాగే అప్పట్లో జగన్ వరుసగా 11 శుక్రవారాలు ర్టుకు హాజరైన సంగతీ ఆయనపై ట్రోలింగ్ కు దోహదపడింది. అంతెందుకు ఇటీవలి కాలం వరకూ వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా 11 ఉండేది. కొందరు రిజైన్ చేయడంతో ఆ సంఖ్యలో మార్పు వచ్చింది. అది వేరే సంగతి. అలాగే జగన్ ఢిల్లీ పర్యటనల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, పదకొండవ నెంబర్ ఆయన్ను వదల కుండా వెంటాడింది. వెంటాడుతోంది.
జగన్ లెవన్ పై మీమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవన్ లాగా.. జగన్స్ లెవన్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే. పార్లమెంటులో మొదటి అంతస్తులోని 11వ నంబర్ రూమ్ ను స్పీకర్ కేటాయించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైసీపీ ఎంపీలు ఆ రూమ్ ను ఆక్యుపై చేయడానికి నిరాకరించారు. మూకుమ్మడిగా స్పీకర్ ను కలిసిన వారు ఆ రూమ్ తమకు వద్దనీ, మరో రూమ్ కేటాయించాలంటూ కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకున్నారు. వారి వినతులను మన్నించి స్పీకర్ వారికి 11వ నంబర్ రూమ్ ను మార్చి 12వ నెంబర్ రూమ్ ను కేటాయించారు. దీంతో 11 నంబర్ జగన్ ను వదల బొమ్మాలీ నిన్నొదల అన్నట్లు వెంటాడుతోందని నెటిజనులు నెట్టింట సెటైర్లు గుప్పిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/number-11-haunting-jagan-39-216108.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.