Publish Date:Jan 25, 2022
కొవిడ్ మూడోవేవ్ లో భారీ సంఖ్యలో ప్రజలు కరోనా భారిన పడుతున్నారు. ఈ సమయంలో కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవల్ని మరింత విస్తృతం చేసింది. జూమ్ యాప్ ద్వారా వీడియో లింక్ లు షేర్ చేసి వేల మంది కోవిడ్ బాధితులకు టెలిమెడిసిన్ సాయం అందిస్తోంది. అవసరమైన వారికి ట్రస్ట్ ప్రతినిధుల ద్వారా మందులు వారి ఇంటికే పంపిస్తోంది. 12 మంది దేశ విదేశీ వైద్యులతో ఏర్పాటు చేసిన వైద్య బృందాలు వారం రోజులుగా రోజుకు నాలుగైదు గంటల పాటు వీడియో కాల్ ద్వారా వందల మందిని ట్రీట్ చేస్తున్నారు. బాధితులకు సేవలు అందించే కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
జూమ్ మీటింగ్ లింక్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్టు వేలాది మంది బాధితులు చెప్పిన సమస్యలపై డాక్టర్లు చర్చించి, వారికి తగిన సూచనలు చేస్తున్నారు. వైద్య బృందంలో అమెరికా నుంచి నలుగురు వైద్యులు ఉండగా మిగిలిన 8 మంది ఏపీ నుంచి రోగులకు వైద్య సాయం అందిస్తున్నారు. కోవిడ్ గత రెండు వేవ్ ల్లో ఆక్సిజన్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసిన ట్రస్ట్ యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది కోవిడ్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సుమారు 1 కోటి 75 లక్షల విలువైన మందులు, ఆహారం, వైద్య పరికరాలను ఎన్టీఆర్ ట్రస్టు అందించింది.
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రోజువారీ ట్రస్ట్ సేవలను సీఈఓ రాజేంద్ర కుమార్ తో కలిసి పర్యవేక్షిస్తూ అందరినీ సమన్వయ పరుస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆపద సమయంలో ట్రస్ట్ సేవల్లో భాగస్వాములైన అందరికీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ntr-trust-in-covid-health-care-39-130721.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.