యుగపురుషుడు ఎన్టీఆర్

Publish Date:May 28, 2026

Advertisement

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

 ఎన్టీఆర్ లాంటి మహనీయుడు తెలుగునేలపై పుట్టడం యావత్ తెలుగుజాతికి గర్వకారణం, అన్న ఎన్టీఆర్ యుగపురుషుడు అని నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. బే ఏరియాలో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి, మినీ మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపి నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్ లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జరిగిన ఈ వేడుకలకు పెద్దఎత్తున టిడిపి అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారనీ, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి మహానాడు జరుగుతున్న సమయంలోనే ఇక్కడ కూడా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని జయరాం అన్నారు. మహానాడు రెండవరోజు మెయిన్ స్క్రీన్ పై జయరాం కోమటి ఎన్నారైల భాగస్వామ్యంపై ప్రసంగించనున్నారు. 

కార్యక్రమంలో ఎన్టీఆర్ తో కొన్ని సినిమాల్లో నటించిన ప్రముఖ రంగస్థల నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. ఆయన ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. అలాగే దానవీరశూరకర్ణ సినిమాల్లో ఎన్టీఆర్ హావభావాలను అనుకరించి అందరినీ ఆకట్టుకున్నారు. 78 సంవత్సరాల వయస్సు గల ఆయన గతంలో జమునతో కలిసి శ్రీకృష్ణరాయబారం నాటకాలను వివిధ చోట్ల ప్రదర్శించారు. ఎన్నారై టీడిపి నాయకుడు వెంకట్ కోగంటి ఈ వేడుకల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా చిన్నారులచేత కేక్ కట్ చేయించారు. తరువాత జూమ్ మీటింగ్ ద్వారా మెయిన్ మహానాడును వీక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ్ సాగర్ రెడ్డి, సీతారాం కొడాలి, అంబటి సతీష్, వాసు బండ్ల, భాస్కర్ అన్నె, సురేంద్ర కారుమంచి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, జగదీష్ గింజుపల్లి, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, కోన నరేంద్రనాథ్ రెడ్డి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రవికిరణ్ ఆలేటి, రాఘవయ్య, రాజశేUర్ పర్వతనేని, చంద్రశేఖర్ తిరుమలపుత్ర, రాంబాబు మానుకొండ, మోహన్ శ్రీకాంత్ పచవ, కళ్యాణ్ వీరపనేని, వీరబాబు పత్తిపాటి, లోకేష్, ధీరజ్ కావూరి, మురళీ, కృష్ణ చెరుకుళ్ళ, మునిరెడ్డి, శివ అద్దంకి, నవీన్ కొడాలి, అనిల్ రెడ్డి దప్పిలి, సుధీర్ నెల్లూరు, శ్రీనివాస్ వెలగపూడి, సురేష్ బాబు రాగలపల్లి, మధుసూదన్ రెడ్డివారి, బిల్ల భగవాన్ తో పాటు మహిళా ప్రముఖులు సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, విలేఖ్య వెనిగళ్ళ, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి శిరియాలు నెల్లూరి, దివ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో బీభత్సం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పక్కా ప్లాన్‌తో 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రిベンజ్ మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి.
కర్ణాటక ఐపీఎస్ అధికారిణి డి. రూపా 20 ఏళ్ల సర్వీస్‌లో 40 బదిలీలు ఎదుర్కొన్నా భయపడకుండా అవినీతిపై పోరాడుతున్నారు. శశికళ జైలు కుంభకోణం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలిచిన ఆమె నిజాయితీ సాహస గాథ ఇక్కడ చదవండి.
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.