బాబు భద్రతా విధుల్లో కళ్లు తిరిగిపడిపోయిన ఎన్ఎస్ జీ కమెండో

Publish Date:Apr 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో  ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు అకస్మాత్తుగా కళ్లుతిరిగి పడిపోయిన సంఘటన కలకలం సృష్టించింది.   తన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు విజయవాడ పటమల లోని అన్న క్యాంటిన్ లో అల్పాహారం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం  చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో  మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ,   ప్రభుత్వ లక్ష్యాలు,  భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతుండగా,  చంద్రబాబు పక్కనే నిలబడి విధులు నిర్వహిస్తున్న ఒక ఎన్ఎస్‌జీ కమాండోకు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు.  

అప్రమత్తమైన ఇతర  సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు.  చంద్రబాబు కూడా ప్రసంగాన్ని ఆపి , కమాండో పరిస్థితిని గమనించి ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు.  ఎండ తీవ్రత  కారణంగా ఆ కమెండోకు కళ్లు తిరిగి ఉండొచ్చని ప్రథమికంగా భావిస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం కళ్లు తిరిగి పడిపోయిన కమెండో ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారనీ, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

https://youtube.com/shorts/lZBbGcbs_8U?si=Ba2aXAF1Mfcpu8M6

By
en-us Political News

  
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల‌ ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెట్రోల్ బంక్‌లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.
ఇది సాధారణ చోరీ ప్రయత్నమా.. అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్, పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్‌కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు.
జపాన్ ప్రధానమంత్రి సనాయే టకాయిచీతో ఫోన్ లో మాట్లాడిన పెజెష్కియాన్, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని విమర్శించారు. ఇరాన్ నౌకలపై అమెరికా పాల్పడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వైశాఖ పూర్ణిమ వేడుకల కోసం జల్జలా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. థవాంగ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్జలా వద్ద బురదతో కూడిన ఇరుకైన రోడ్డుపై జీపు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వాహనం జారిపోయి లోయలోకి దూసుకెళ్లింది.
ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వేగాన్ని తెచ్చాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ (19 బంతుల్లో 39) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్-ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు వికెట్ నష్టానికి 69 పరుగులు.
ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారిలో 16 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీయగలిగారు. అయితే.. గాలి వేగం ఎక్కువగా ఉండటం, చీకటి పడటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.