Publish Date:Mar 13, 2025
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోసారి మాదాపూర్ ఇంటికి నోటీసులు అతికించారు. మొయినా బాద్ తోల్కట్ట ఫాం హౌజ్ లో కోడి పందాలు నిర్వహిస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీకి గతంలో నోటీసులు ఇచ్చిన మొయినాబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేస్తూ శుక్రవారం విచారణకు రావాలని పేర్కొన్నారు. గత నెలలో పోచంపల్లికి చెందిన ఫాం హౌజ్ లో కోడి పందాలు నిర్వహించారు. పోలీసులు దాడులు చేస్తే 64 మంది పట్టుబడ్డారు. ఈ కేసులో ఎమ్మెల్సీ ని నిందితుడిగా చేర్చారు. గతంలో పోచంపల్లి తన న్యాయవాది ద్వారా నోటీసులకు జవాబిచ్చారు. ఈ జవాబుకు సంతృప్తి చెందని మొయినాబాద్ పోలీసులు మరో సారి నోటీసులు జారి చేస్తూ పోచంపల్లిని వ్యక్తిగతంగా హజరు కావాలని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/notices-once-again-served-on-brs-mlc-pochampally-house-25-194327.html
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.