2015లో మొదలైన ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజకీయాలనే మలుపు తిప్పిందంటే అతిశయోక్తి కాదేమో. ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ వివాదంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు గొప్ప పదవులను కట్టబెట్టింది. ఇది నిజంగా ఒక విచిత్ర రాజకీయ పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక వివరాల్లోకి అంటే.. 2015 కి వెళ్తే.. నాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆ ఎన్నికల్లోతెలుగుదేశం అభ్యర్థిగా నిలిచింది మరెవరో కాదు.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. అప్పట్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో స్టీఫెన్ సన్ నివాసంలో రేవంత్ ఉన్న దృశ్యాలు, ఆడియో టేపులు.. బ్రీఫ్డ్ మీ వంటి పోన్ సంభాషణలు పెను ప్రకంపనలు పుట్టించాయి.
ఈ ప్రకంపనలు ఎంత మేలు చేశాయంటే.. రేవంత్ రెడ్డి ఆ కేసు విషయంలో అరెస్టు కాగా.. అది ఆయనలో ఎలాగైనా సరే కేసీఆర్ పీచమణచాలన్న కృతనిశ్చయం వచ్చేలా చేసింది. దానికి తోడు ఆయన తన కుమార్తె వివాహ సమయంలో ఈ అరెస్టు కావడంతో ఆ కసి రెట్టింపు అయ్యింది. కేసీఆర్ నీ అంతు నా చేతుల ద్వారానే జరుగుతుంది చూసుకో! అంటూ ఆయన జైలు నుంచి విడుదలైన టైంలో చేసిన ప్రసంగాలు, పిడికిలి బిగించి చేసిన సంజ్ఞలు తెలంగాణ రాజకీయాల్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత కాలంలో.. ఆ కసీ క్రోధమే రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
ఈ కేసు రేవంత్, వేం నరేందర్ రెడ్డి.. ఇద్దరినీ ఒకరికొకరు నమ్మకమైన స్నేహితులుగా మార్చేసింది. ఇరువురూ తమ కష్టనష్టాల్లో పాల్పంచుకున్నారు. ఒకరి శ్రేయస్సే మరొకరిగా భావించచారు. ఇప్పుడు చూస్తే వారి మధ్య ఆ గాఢానుబంధం.. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్నేహ అధ్యాయాన్ని లిఖించింది. దీంతో పాటు ఈ కేసు ద్వారా జరిగిన మరో విషయమేంటంటే.. ఏమిటంటే చంద్రబాబు హైదరాబాద్ రాజధానిగా పదేళ్లు ఉండటానికి హక్కున్నా దాన్ని వదులుకుని అమరావతి వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ ప్రజలకు అత్యంత దగ్గరగా మసులుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే.. చెడు జరిగిందని.. ఇక అక్కడితో అయిపోయిందని భావించకూడదు. ఒక చెడు మరో మంచికే అని భావించి ముందడుగు వేయాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/note-for-vore-case-39-215096.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.