లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలవడం : మావోయిస్టు అగ్రనేత ఆశన్న

Publish Date:Oct 17, 2025

Advertisement

చతిస్ గఢ్  సీఎం ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు,   చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో  జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో  పాల్పడ్డ కీలక పాత్రధారి, సూత్రధారి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నఅలియాస్ రూపేష్  లొంగిపోయాడు.  ఆయనతో పాటు 208 మంది లొంగిపోయినట్లు  అధికారులు ప్రకటించారు.  మావోయిస్టు అగ్రనేత ఆశన్న అలియాస్ రూపేష్ లొంగుబాటు చరిత్రలోనే అతిపెద్ద  లొంగుబాటుగా చెప్పవచ్చు. 
దేశ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో  ఇదో కీలక మలుపు అంటున్నారు విశ్లేషకులు.  దశాబ్దాలుగా అడవుల్లో ఆయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్..  తన అనుచరులతో కలిసి చత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయాడు. గన్ను వదిలి రాజ్యాంగాన్ని చేపట్టడానికి మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న నిర్ణయించుకోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. వనం వదిలి ఆయన జనం బాట పట్టారు.  ఆయనతో కలిసి  మొత్తం 208 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో మహిళలు 110 మంది, పురుషులు 98 మంది ఉన్నారు. లొంగిపోయిన వారు 153 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. వీరందరిపై కలిపి  సుమారు 8 కోట్ల రూపాయల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.

ఇలా ఉండగా తన లొంగుబాటు సందర్భంగా ప్రసంగించిన ఆశన్న.. తమది లొంగుబాటు కాదని చెప్పారు. తాము జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన  తన సహచరులను ఉద్దేశించి చేసిన ప్రసంగం హృద్యంగా ఉంది.  అనివార్య పరిస్థితుల్లో   ఆయుధాలను వదిలిపెడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు. ఎవరికి వారే తమ తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం కానీ మన పంథాను మరచిపోవడం లేదు, జనజీవన స్రవంతిలో కలిసి  ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆశన్న ఉద్ఘాటించారు. సహచరులంతా ఎక్కడ ఉన్నారో అక్కడే లొంగిపోవడం మంచిదని సూచించారు. ఎవరైనా లొంగిపోదామని భావిస్తే తనను సంప్రదించాలన్నారు.  ఇది లొంగుబాటు కాదు, జనజీవన స్రవంతిలో కలవడమన్న మాటను  ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పిన ఆశన్న.. ఉద్యమంలో అమరులైన సహచరులకు ఆయన ఈ సందర్భంగా జోహార్లు చెప్పారు.  ఆయన ప్రసంగం విన్న మావోయిస్టు క్యాడర్ కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉన్నారనీ, ఆ తరువాత వారి కళ్లు చెమ్మగిల్లాయని అక్కడున్న అధికారులు తెలిపారు. ఆయన మాటలు విన్న మావోయిస్టు కేడర్లు క్షణకాలం నిశ్శబ్దంగా నిలబడి కంటతడి పెట్టారని అక్కడున్న అధికారులు తెలిపారు.

ఇలా ఉండగా శుక్రవారం ఛత్తీస్ గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులలో  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ రూపేష్, కేంద్ర కమిటీ సభ్యుడు రాజ్ మాన్ మండవి, సెంట్రల్ జోన్ కమిటీ సభ్యులు రాజు సలాం,  వెట్టి అలియాస్ సంతు, సీనియర్ డివిజనల్ కమాండర్‌ రతన్ ఇలాం, రీజనల్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.   ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి కేంద్ర, జోన్, రీజనల్ స్థాయి నాయకులు లొంగిపోవడం భారత మావోయిస్టు చరిత్రలో ఇదే తొలిసారి.


కాగా ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఇది శాంతి పథకానికి గొప్ప విజయంగా అభివర్ణించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస సదుపాయాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.  భారత మావోయిస్టు ఉద్యమంలో ఒకే సారి రెండు వందల మందికి పైగా లొంగిపోవడం ఇదే మొదటిసారన్న ఆయన..  ఇది కేవలం ఒక సాంఘిక పరిణామం మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న  హింసా మార్గానికి ముగింపు సంకేతమని చెప్పారు.  రూపేష్ లొంగుబాటు దేశ మావోయిస్టు ఉద్యమానికి కొత్త దశను తెరిచింది. “ఇది లొంగుబాటు కాదు — ప్రజలతో కలిసిపోవడం” అనే రూపేష్ మాటలు ప్రస్తుతం చత్తీస్‌గఢ్ అడవుల్లో మారుమ్రోగు తున్నాయి.ఈ పరిణామం శాంతి వైపు మావోయిస్టు ఉద్యమం మెల్లగా మలుపు తీసుకుం టున్న సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
రేవంత్ రెడ్డి హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశం అనంతరం అదే రోజు రాత్రి ఆయన ఢిల్లీ నుంచే నేరుగా లండన్  బయలుదేరతారు.
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.