ప్రజలకే కాదు.. కార్యకర్తలకూ పట్టని వైసీపీ బస్సుయాత్ర!?

Publish Date:Oct 27, 2023

Advertisement

మంత్రులు,  ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్రత్యేక బస్సులు వేసుకొని యాత్రకు బయలుదేరారు. మంత్రులకు చేసే పనేం లేదన్న విషయం తెలిసిందే. ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ సీఎం జగన్ తీసుకుంటారు. జగన్ తీసుకుంటారనే కంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శా సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటారంటే సరిగ్గా సరిపోతుంది. ఆయా శాఖలకు సంబంధించి కార్యక్రమాలపై మీడియా సమావేశాలను కూడా సజ్జలే అడ్రస్ చేస్తారు. దీంతో పని లేని మంత్రులకు ఏదో పని చెప్పాలికదా అన్నట్లుగా సీఎం జగన్ ప్రభుత్వ ఘనతలను ప్రజలకు చాటండంటూ బస్సు యాత్ర పేరిట వారిని జనంలోకి పంపించేశారు. ఇక ఎమ్మెల్యేల సంగతి చప్పనవసరం లేదు. వారికీ వారి వారి నియోజకవర్గాలలో ఎటూ పనిలేదు. అన్నీ వాలంటీర్లే చూసుకుంటారు. సో వారినీ జనం మీదకు తోలేశారు సీఎం జగన్.

బస్సు యాత్ర పేరిట జనంలోకి వెళ్లి వారు చేయాల్సిందేమిటయ్యా అంటే మా ప్రభుత్వం ఇది చేసింది.. అది చేసింది. మా ప్రభుత్వ హయాంలో ఇంత అభివృద్ధి జరిగింది. అంత అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అదేం జరగలేదన్న విషయం ప్రజలకే కాదు.. బస్సు యాత్ర పేరిట జనంలోకి వస్తున్న మంత్రులూ, ఎమ్మెల్యేలకు కూడా  స్పష్టంగా తెలుసు. అందుకే వారు ఈ బస్సు యాత్ర పేరిట ఒకే మంత్రం జపిస్తున్నారు. ఆ మంత్రుం ఏమిటంటే..విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడటం. ఆ విమర్శలను జనం పట్టించుకుంటున్నారా? లేదా అన్నది వారికి అనవసరం. మీడియాలో వచ్చి అది సీఎం జగన్ కంట పడితే చాలు. వారి లక్ష్యం నెరవేరిందని సంబరపడిపోతారు.

జనం ఛీత్కారాలు, తిరుగుబాట్లు వారికేం కొత్త కాదు. గతంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనే వారికి జనం ఛీత్కారాలు అనుభవేకవైద్యం అయ్యాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ ఎక్కడా ఈ ఐదేళ్లలో ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. వైసీపీ నేతలు, మంత్రులూ ఏదైనా కార్యక్రమం పెట్టుకుని జనంలోకి వచ్చినా.. వారికి ఎదురౌతున్నది ప్రజా తిరస్కారం మాత్రమే.  సమస్యలపై నిలదీతలు, హామీలను విస్మరించారంటూ జనం ఆగ్రహం ఇవే వారికి ఎదురౌతున్నది. అయితే ఈ సారి బస్సు యాత్రలో వారికి గొప్ప ఉపశమనం కలిగింది. అదేమిటంటే వారి యాత్రను జనం అస్సలు పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా పట్టుమని వంద మంది కూడా రాని పరిస్థితి. ముఖ్యమంత్రి సభలకు అయితే నయానో భయానో, బెదరించో, బామాలో జన సమీకరణ చేసేవి పార్టీ శ్రేణులు. విషయం తెలిసి కూడా చేతి చమురు వదుల్చుకుని బస్సు యాత్రలకు కూడా జనసమీకరణ కోసం కష్టపడటం ఎందుకనుకున్నారో ఏమో కార్యకర్తలు కూడా కాడి వదిలేవారు. దీంతో వైసీపీ బస్సు యాత్రలు ఎవరికీ పట్టని కార్యక్రమంగా మారిపోయాయి.

తొలి రోజు మూడు ప్రాంతాల నంచీ ఏకకాలంలో ప్రారంభమైన బస్సు యాత్రలలో ఇదే పరిస్థితి సాక్షాత్కరించింది. ఖాళీ కుర్చీలను ఉద్దేవించి చేసిన ప్రసంగాలలో కూడా నేతలు చంద్రబాబునాయుడిని, జనసేనానిని విమర్శించడానికే పరిమితమైపోయారు తప్ప.. మరో మాట వారి నోటి వెంట రాలేదు.  ఇంతకీ ఈ యాత్రలో వైసీపీ వారికి కలిగిన ఉపశమనం ఏమిటంటారా.. జనం పట్టించుకోకపోవడంతో గడపగడపకూలోలా వారికి నిరసన సెగలు తగలలేదు. మొత్తంగా వైసీపీ ఆర్భాటంగా ప్రారంభించిన ఈ యాత్రను ప్రజలే కాదు, వైసీపీ శ్రేణులు కూడా పట్టించుకోలేదన్నదే పరిశీలకులు విశ్లేషణ. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.