ఈశాన్యంలో బరువు

Publish Date:Jul 31, 2018

Advertisement

 

అదో చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అంతా ఆరోగ్యంగా, హాయిగా ఉండేవాళ్లే... ఓ కుర్రవాడు తప్ప. ఆ కుర్రవాడు చిన్నప్పటి నుంచి చాలా బక్కపలచగా, నీరసంగా ఉండేవాడు. దాంతో ఎప్పుడూ ఏదో ఒక జబ్బు చేస్తుండేది. తన జీవితం ఇంక మంచానికే అంకితం అనుకున్నాడు కుర్రవాడు. నిదానంగా ఎటూ కదలకుండా ఇంటిపట్టునే ఉండటం మొదలుపెట్టాడు. అతని స్నేహితులు, బంధువులు అంతా దూరమైపోయారు. తల్లిదండ్రులకు అతను ఓ భారంగా మిగిలిపోయాడు.

 

పరిస్థితులు ఇలా ఉండగా ఓసారి ఆ ఊరికి ఓ స్వామీజీ వచ్చాడు. స్వామీజీని చూడటం ఆలస్యం కుర్రవాడి తండ్రి ఆయన కాళ్ల ముందు పడి భోరుభోరుమని ఏడ్చాడు. తన పిల్లవాడి సంగతి చెప్పి ఏదన్నా ఉపాయం సూచించమన్నాడు. తండ్రి బాధ విన్న స్వామీజీ మనసు కరిగిపోయింది. వెంటనే ఆ కుర్రవాడిని చూసేందుకు వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి పరిసరాలన్నీ బాగా గమనించాడు. ఇంటి వెనక నేలలోకి పాతుకుపోయి ఉన్న ఓ పెద్ద బండరాయి ఆయన దృష్టిని ఆకర్షించింది.

 

‘‘మీ ఇంటి ఈశాన్యంలో ఇంత బరువు ఉండబట్టే ఈ దరిద్రం పట్టింది. కుర్రవాడితో వెంటనే ఆ రాతిని పక్కకి జరిపించు. పరిస్థితులన్నీ చక్కబడతాయి,’’ అని సలహా ఇచ్చి తన దారిన తను వెళ్లిపోయాడు.

 

స్వామీజీ చెప్పిన మాటల్ని కుర్రవాడు వెంటనే అమలు చేయడం మొదలుపెట్టాడు. కానీ పాపం ఆ రాయితో ఎంత కుస్తీ పట్టినా ఒక్క అంగుళం కూడా కదలకపోయే! రోజు తర్వాత రోజు... రాతితో ఎంత పోరాటం చేసినా కాస్త కూడా ఉపయోగం లేకపోయింది. చుట్టుపక్కల వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. కానీ కుర్రవాడిలో ఏదో ఒక మూల తన జీవితం బాగుపడుతుందేమో అన్న ఆశ. ఆ ఆశతోనే రాయిని జయించే ప్రయత్నం కొనసాగించాడు. కొన్నాళ్లు తాళ్లని కట్టి లాగాడు, ఇంకొన్నాళ్లు సుత్తితో రాయిని మోదాడు. కానీ ఏం చేసినా రాయిని మాత్రం పూర్తిగా అక్కడి నుంచి తొలగించలేకపోయాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఆరు నెలలు గడిచిపోయాయి. కుర్రవాడిలో పట్టుదల తగ్గలేదు... ఆ రాయీ అక్కడి నుంచి కదల్లేదు.

 

ఇంతలో ఆ స్వామీజీ మళ్లీ అటువైపుగా వచ్చాడు. స్వామీజీని చూడగానే కుర్రవాడి తండ్రి భగ్గుమన్నాడు- ‘మీరేదో మంచి ఉపాయం చెబుతారని మీతో మా కష్టాలు పంచుకుంటే ఇలాంటి పనికిమాలిన పని అప్పగిస్తారనుకోలేదు. మీరు అప్పగించిన పని ధ్యాసలో పడి కుర్రవాడు నిరంతరం ఆ రాయి దగ్గరే ఉంటున్నాడు. మీరు ఇంత మోసగాళ్లు అనుకోలేదు...’ అంటూ కడిగిపారేశాడు.

 

కుర్రవాడి తండ్రి మాటల్ని విన్న స్వామీజీ చిరునవ్వుతో... ‘‘ఒక్కసారి నీ కొడుకు వంక చూడు. ఆరునెలలకీ ఇప్పటికీ మధ్య అతనిలో ఏమన్నా మార్పు వచ్చిందేమో గమనించు,’’ అన్నాడు. స్వామజీకి మాటలు విన్న తండ్రి ఒక్కసారి తన కొడుకు వంక చూశాడు. ఒకప్పుడు బక్కపలచగా తూలిపోతున్నట్లు ఉండే తన కొడుకు బలిష్టంగా తయారయ్యాడు. అతని కండలన్నీ చెమటలు పట్టి ఎండలో మెరుస్తున్నాయి. అతని చూపులో పట్టుదల కనిపిస్తోంది, చేతులు చురుగ్గా కదులుతున్నాయి. ‘‘నిజమే అప్పటికీ ఇప్పటికీ నా కొడుకులో అసలు పోలికే లేదు. నేను ఆ దిశగా గమనించనేలేదు సుమా!’’ అంటూ ఆశ్చర్యపోయాడు తండ్రి.

 

‘‘శ్రమని మించిన వరం లేదు. అది ఎప్పుడూ వృథా పోదు. ఇన్నాళ్లూ ఆ విషయం తెలియక నీ కొడుకు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. శరీరాన్ని ఎందుకూ పనికిరాకుండా మార్చుకున్నాడు. మీ ఇంటి ఈశాన్యంలో ఉన్న బరువు నీ కొడుకు బద్ధకమే! అది ఇప్పుడు తొలగిపోయింది,’’ అంటూ చెప్పుకొచ్చాడు స్వామీజీ!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో మూలన  ఏదో పండగనో, ఉత్సవమో జరుగుతూనే ఉంటుంది.
స్వతంత్ర భారతదేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించటానికి ఎంతో మంది నాయకులు కృషి చేశారు. ఒక్కో నాయకునిదీ ఒక్కో ప్రత్యేకత.
క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇది క్రైస్తవ మతస్తులు చాలా ఇష్టంగా  జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ.
చిన్నతనంలోనే పిల్లలు సంస్కారవంతులు కావాలంటే. ఈ 5 అలవాట్లు నేర్పాలి..!
గణితం…. పుస్తక భాషలో చెప్పుకుంటే లెక్కల శాస్త్రం అనొచ్చు. అసలు ఈ లెక్కలు లేకుండా మన జీవితాన్ని ఊహించగలమా?
 ‘చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటూ పాటలు రాసి మరీ నేటి తరానికి చీర గొప్పతనం గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతీ ఒక్కరం అమ్మ చీర కొంగు నీడలో పెరిగినవాళ్ళమే అన్న విషయం గుర్తొస్తుంది.
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.  
ప్రజలు చాలావరకు మానసిక సమస్యలతోనే  ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు.
శనగపిండి భారతీయులు ఉపయోగించే పిండులలో ఒకటి.  
ప్రపంచంలో ప్రతీ దేశంలోనూ వేర్వేరు జాతులవారు, వేర్వేరు భాషలవారు,  వేర్వేరు మతపరమైన విశ్వాసాలు కలిగినవారు ఉంటారు.
సరదా.. చాలా సహజంగా అనిపించే విషయం. చాలామంది సాధారణంగా మాట్లాడే సమయంలో సరదా పేరుతో కొన్ని జోక్స్ వేయడం లేదా కొన్ని మాటలు అనడం చేస్తుంటారు.
డబ్బు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది.  సిల్లీ విషయం ఏంటంటే.. ఈ డబ్బును మనిషే కనిపెట్టాడు.
నేడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ఏ దేశానికాదేశం,  వారి మిలిటరీ శక్తి సామర్ధ్యాలతో భయపెట్టి తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని,ప్రపంచ రాజకీయాల్లో తామే హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.