వీకెండ్ విరామం లేదు.. లోకేష్ పాదయాత్ర నిరాటంకం!

Publish Date:May 15, 2023

Advertisement

పాదయాత్ర మొదలు.. మధ్య మధ్యలో విరామం ఇచ్చి.. ప్రతీ గురువారం రాత్రి విమానంలో హైదరాబాద్‌కు వచ్చేసి.. మళ్లీ ఆ మరునాడే అంటే శుక్రవారం సాయంత్రం విమానం ఎక్కి అటు విజయవాడ ఎయిర్‌పోర్టో లేదా రాజమండ్రి ఎయిర్ పోర్టో అదీకాకుంటే కోడి కత్తితో అదృష్టాన్ని తెచ్చి పెట్టిన విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనో దిగి పాదయాత్ర ఎక్కడ వరకు ఆపారో.. అక్కడికి చేరుకొని.. మళ్లీ పాదయాత్ర కొన... సాగించడాలు లేవు. అలాగే నేను ఉన్నాను.. నేను విన్నాను లాంటి కాకమ్మ కబుర్లు లేవు... ఇక తెచ్చి పెట్టుకొన్న షిక్కటి  చిరునవ్వులు అయితే అసలు లేవు కాక లేవు.. ఉన్నది ఒక్కటే.. దృఢ సంకల్పం.. స్థిర చిత్తం.. వీటినే ఆయుధంగా మలుచుకొని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం  పాదయాత్ర నిర్విరామంగా ముందుకు దూసుకు పోతోంది. ఓ వేళ ఆయన.... తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చినా, అది నందమూరి తారకరత్న మరణించిన సమయంలో హైదరాబాద్ చేరుకొని.. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి.. మళ్లీ  వెంటనే తిరిగి వచ్చి తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకేష్.

అలాగే హైదరాబాద్ మహానగరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించినా...  ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభ వేడుక ఘనంగా జరిగినా నారా లోకేష్  తన పాదయాత్రకు  తాత్కాలిక  విరామం ఇచ్చి.. వాటిలో పాల్గొన లేదు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే జగన్ ప్రభుత్వం మేమే నెంబర్ వన్ అంటూ.. జీవో నెంబర్ వన్ తీసుకు వచ్చినా.. అలాగే యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్‌కు పోలీసులు పలు రకాల అడ్డంకులు సృష్టించినా.. ఎక్కడ ఆయన పాదం అగిందీ లేదు.. మరెక్కడా ఆయన వెనకడుగు వేసింది లేదు.  

అలా జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర విరామం లేకుండా.. ప్రతి రోజూ..   గ్రామాలు, పట్టణాల ప్రజలతో ఆయన మమేకమవుతూ ముందుకు సాగిపోతున్నారు. అలాగే  రైతులు, మహిళలు, యువత... ఇలా అందరిని కలుసుకొంటూ.. వారి సమస్యలను అడిగి.. వాటిని సావధానంగా వినడం.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ  స్పష్టమైన భరోసా సైతం కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. 

అయితే నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మే 15వ తేదీ అంటే సోమవారం వంద రోజుల మైలు రాయిని చేరుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఆయన చేపట్టిన పాదయాత్ర శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొని..  అశేష ప్రజాభిమానంతో దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికి రాయలసీమలోని మూడు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర కొనసాగింది. అదీ రాయలసీమ... ఆ పైన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇలాకా కడప జిల్లాలో సైతం నారా లోకేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం సైతం పట్టారు. ఇక ఆయన పాదయాత్ర కోస్తా జిల్లాల.. మీదగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తే..  ఇక జనం ప్రభంజమే అని పరిశీలకులు అంటున్నారు.

మరోవైపు నారా లోకేశ్ 100వ రోజు మైలురాయిని పూర్తి చేసుకొంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అందులోభాగంగా నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా 175 నియోజవర్గాల్లోని పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్ల మేర పాదయాత్రను నిర్వహించనున్నాయి.     

ఇక మే రెండో ఆదివారం మదర్స్ డే ఈ నేపథ్యంలో నారా లోకేష్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 99వ రోజు అంటే మే 14వ తేదీ ఆదివారం తన పాదయాత్ర ముగించుకొని శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల క్యాంప్ వద్దకు ఆయన చేరుకొగానే.. ఎదురుగా తల్లి భువనేశ్వరి కనిపించడంతో నారా లోకేశ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

ఈ 100వ రోజు లోకేశ్ పాదయాత్రలో తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇక భర్త చంద్రబాబు సుదీర్ఘ రాజకీయం జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రానీ నారా భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి అడుగు వేయడం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువగళం పేరుతో నారా లోకేశ్ 2023, జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర.. 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.