Publish Date:Jun 26, 2022
కలిసొచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు. కలిసొచ్చిన కాలాన్ని కాలదన్నుకోవడం జగన్‌కే సాధ్యపడిందని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు జగన్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి తీవ్రమైన పోటీ నెలకొంది. దేశంలోని విపక్షాలన్నీ కలిసి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. బిజెపి మిత్రపక్షాలు ద్రౌపది ముర్మూను ఖరారు చేశాయి. ఈ పర్యాయం రాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షం కాకుండా చూడాలని గట్టిగా యత్నించడంలో సిన్హాకు మద్దతు తెలియజేయమని జగన్‌కు విపక్షాలకు నాయకత్వం వహిస్తున్న మమతా బెనర్జీ లేఖ కూడా రాశారు.
కానీ జగన్ ఏడిఏ అభ్యర్ధి ముర్మూకే మద్దతు తెలిపారు. నిజానికి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ మద్దతు ఎన్డీయేకి చాలా అవసరం. అలాంటపుడు కేంద్రం నుండి రాష్ట్రప్రయోజనాల దృస్ట్యా ఎలాంటి హామీ తీసుకోకుండానే జగన్ ఓకే అనేయడం దారుణమని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్రాన్ని నిలదీయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇక ముందు కూడా దొరకదని హోరెత్తుతూనే వున్న విపక్షాలది కేవలం అర్ధంలేని గోలగానే జగన్ భావించారా? లేక కేంద్రానికి ఈసారి సాయం చేసి ఆ తర్వాత రాష్ట్రానికి రావలసినవి అడుగుదామనుకున్నారా? జగన్ మనసులో ఏముందో తెలియదు. కానీ అదే ధ్యాసలో వుంటే మాత్రం చాలా తప్పిదం చేసినట్టే అవుతుంది.
ఇపుడు చేతికి అందిన అవకాశాన్ని చేజేతులా వదులుకోవడంలో స్వామి భక్తి ప్రదర్శన చూపడం అర్ధరహితమే అవుతుంది. జగన్ తీరు వల్ల రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించుకోలేని పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసుల భయంతోనే జగన్ ఇలా చేశారని విమర్శిస్తున్నాయి.
రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు ఇటీవలి కాలంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేంద్రం నుండి తమకు రావలసిన హక్కులను సాధించుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రతిపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఎన్డీయే అభ్యర్ధి ముర్మూకు మద్దతు తెలపడం జగన్ అసమర్ధతే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనీస స్థాయిలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఊసేలేదు. అటు ఎన్డీయే గానీ ఇటు విపక్షాలుగానీ కనీసం చంద్రబాబు వంక తొంగిచూడలేదు.
జగన్ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతివ్వడం ద్వారా రాజకీయంగా జగన్ కు మంచే జరిగింద నుకుంటున్నారు విశ్లేషకులు. జగన్ తన నిర్ణయంతో బీజేపీకి క్లోజ్ అవుతూనే.. ఆ పార్టీతో దోస్తీ చేయాలన్న చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారన్న చర్చ జరుగుతోంది. ఐతే ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితులున్నా సద్వినియోగం చేసుకోలేదన్న విమ ర్శలు వస్తున్నాయి.
మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరించి విభజన సమస్యలు పరిష్కరించుకొని ఉంటే బావుండేదని.. అలా కాకుండా ఊరుకి ముందే మద్దతు తెలిపడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది. అలాంటిది కేంద్రాన్ని నిలదీసే అవకాశం వచ్చిందినా వదిలేశారన్న మాట కూడా వినిపిస్తోంది. అంతేకాదు అవసరం తీరిన తర్వాత బీజేపీకి ఎవరైనా ఒకటేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-vother-of-state-benifit-jagan-beeds-only-political-benifit-39-138477.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.