వైసీపీ ఎంపీలతో విశాఖకు ఒరిగిందేంటి? ఏమి ఉపయోగం వారితో?

Publish Date:Mar 2, 2022

Advertisement

జాతీయ రాజకీయాల్లో విశాఖ జిల్లా ఒకప్పుడు చాలా యాక్టివ్‌.. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులైతే శక్తివంతులు. దమ్మున్నోళ్లు. వారు కనుసన్నల్లోనే అప్పట్లో రాజకీయాలు జరిగేవి అంటే అతిశయోక్తి కాదు. గతంలో ఎంపీలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, ద్రోణంరాజు సత్యనారాయణ, సబ్బం హరి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు వంటి వారు ఢిల్లీలో చక్రం తిప్పారు. ప్రజా సమస్యలపై గళం విప్పడంలోనూ.. అభివృద్ధి పనుల కోసం ప్రయత్నించడంలోనూ తమదైన ముద్రను వారు వేశారు. ఇదంతా గతం.

ఇక వర్తమానంలోకి వస్తే.. విశాఖ జిల్లాలోని ఎంపీలు జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేయలేక చతికిలపడిపోతున్నారనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత వైసీపీ పార్లమెంట్ సభ్యులు క్రియాశీలకంగా లేరని జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. వైజాగ్ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ రాజకీయాల్లోనే కాదు స్థానికంగా కూడా తమదైన ముద్ర ఏమాత్రం వేయలేకపోతున్నారని అంటున్నారు. తాము గెలిచిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎంపీలను ఖాతరు చేయడం లేదంటున్నారు. విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన ప్రస్తుత వైసీపీ ఎంపీలు ఎవరూ ప్రజలకు తెలియకపోవడమే పెద్ద సమస్య. వీరికి ఏమాత్రం జనాదరణ లేదు. వైఎస్ జగన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో విశాఖ జిల్లా ప్రజలు వారికి ఓటు వేసి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించారు.  అయితే.. వారు ప్రజలతో సంబంధాలు కొనసాగించడం లేదట. తమ తమ నియోజకవర్గాల్లో ఏనాడూ పర్యటించడం లేదు. ఎక్కువగా తమ సొంత పనుల కోసమే సమయం వెచ్చిస్తున్నారట.
 
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి ఈ మూడేళ్లలో లోక్‌ సభలో ఏనాడూ నోరు విప్పిన పాపాన పోలేదు. సభకు వెళ్లడం.. మౌన మునుల్లాగా కూర్చుంటున్నారనే ఆరోపణ ఉంది. తమ నియోజకవర్గాలు, పార్టీ వేదికల్లో అయినా ఏమైనా మాట్లాడతారా..? అంటే మౌనమే వారి భాషగా ఉంటోంది. ఎంవీవీ సత్యనారాయణ, మాధవి ఇద్దరూ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అయితే.. చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న భీశెట్టి సత్యవతి కూడా మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.

వైజాగ్ రైల్వే జోన్ సమస్య,ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం ఇతర సమస్యలపైన కూడా వారు చొరవ చూపడం లేదనే విమర్శ ఉంది. విశాఖకు గుర్తింపు తెచ్చింది కీలకమైన స్టీల్ ప్లాంట్. ఐదు లక్షల మంది జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తుంది ఇది. ఇప్పుడు ఈ పరిశ్రమపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. స్ధానిక ఎంపీలైన ఈ ముగ్గురూ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడమో.. మంత్రులను కలిశామని చెప్పడానికో పరిమితం అవుతున్నారే గానీ గట్టిగా పట్టుబట్టి పార్లమెంటులో నిలదీసే సాహసం చేయడంలేదని విమర్శలు ఉన్నాయి.

విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ- స్థానిక ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేదట. సొంత వ్యాపారాలకే ఆయన పరిమితమయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీకి ప్రముఖ నాయకుడితో ఎంవీ సత్యనారాయణకు సమస్యలు ఉండడంతో ఆయన వ్యాపారాలకే పరిమితమయ్యారంటారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి డాక్టర్‌ గా పెద్ద పేరుంది. అయినా ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ వర్గం.. సత్యవతి గ్రూప్ మధ్య విభేదాలు ఉన్నాయి. వారి మధ్య ఆధిపత్యం కోసం పోరు కొనసాగుతోంది. గొడ్డేటి మాధవి.. అరకు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆమె ఏనాడూ సమస్యలపై ఎలుగెత్తిన దాఖలాలు లేవు. అరకు నియోజకవర్గం పేరుకు పర్యాటక ప్రాంతమైనా గిరిజనుల అగచాట్లు అన్నీఇన్నీ కావు. అరకు ఎంపీ నియోజకవర్గంలో కూడా గ్రూపుల గోల తక్కువేమీ కాదు. పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఎంపీ మాధవికి సరిపడటం లేదు. వీరంతా లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్దారని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని వీరిని ఎన్నుకున్నారు. అయితే.. వీరు నామ్‌ కే వాస్తేగా మిగిలిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇంకా ఇలాగే వీరు ఉంటే రాజకీయంగా కనుమరుగు అవడం తథ్యమనేది పొలిటికల్ పండితుల విశ్లేషణ.

By
en-us Political News

  
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.