40 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ హుష్ కాకీ!?

Publish Date:Jul 22, 2023

Advertisement

ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో ఎనిమిది నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఎనిమిది నెలలు మరో లెక్క. అందుకే రాజకీయ  పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెడుతున్నారు. తమ పార్టీలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలలో మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడే ఆ ఎమ్మెల్యేలకు క్లాసులు కూడా పీకారు. వారిలో ఎందరిలో మార్పు వచ్చిందో.. ఎందరిలో మార్పు రాలేదో తెలియదు కానీ.. కనీసంలో కనీసం 40 మంది ఎమ్మెల్యేలకు మాత్రం వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేటతెల్లమైపోయినట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది. 

పర్ఫామెన్స్  వీక్ ఉన్న వారందరికీ ఇప్పటికే ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించి మరీ చక్కదిద్దుకోవాలని హెచ్చరించారు. ఇకనైనా పని తీరు మార్చుకోకపోతే టికెట్లు ఇవ్వడం కష్టమేననని కూడా అప్పుడే తేల్చేశారు. అప్పట్లోనే  ఓ 20 మంది ఎమ్మెల్యేలకు అయితే అసలు టికెట్లు ఇచ్చేది లేదని కూడా చెప్పగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి 40కి చేరినట్లు తెలుస్తున్నది. ఎన్నికలకు కేవలం నెలల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ ఫైనల్ సర్వేకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటిదాకా చేసిన సర్వేలు ఒక ఎత్తు.. ఈసారి జరుగుతున్న సర్వే మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సర్వే ఫలితాన్ని బట్టే టికెట్ల కేటాయింపు ఉంటుందని అంటున్నారు. 

ఇప్పటిదాకా ఐ ప్యాక్ టీం నుండి మరికొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా తెప్పించుకున్న సర్వే రిపోర్టులు వైసీపీ అధినేత జగన్ వద్ద ఉండగా.. ఇప్పుడు వాటితో పాటు పార్టీ పరంగా సర్వేలు, వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు కూడా చేయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి కూడా ఎప్పటికప్పుడు సర్వేలు అందుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ వడపోసి ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ ఫైనల్ రిపోర్ట్  ఆధారంగానే వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తున్నది. అయితే, ఈ ఫలితాలు వైసీపీ నేతలకు షాక్ ఇస్తున్నాయట. అన్ని సర్వేలను క్రోడీకరించగా వచ్చిన ఫలితాలలో 50 నుండి 60 మంది అభ్యర్థులపై ప్రజలలో  తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందని చెబుతున్నారు. వీరిలో కొందరు సీనియర్ లు,  మాజీ మంత్రులు కూడా ఉండగా.. మరికొందరు అసలు ఇప్పటి వరకూ ప్రజలలోకి వెళ్లని వాళ్ళు  ఉన్నారట.

సీఎం జగన్ మోహన్ రెడ్డి కాకుండా గత ఎన్నికలలో వైసీపీ నుండి 150 ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో రెబల్స్ గా మారనీ.. పార్టీకి దూరమవనీ.. అంటీముట్టనట్లుగా ఉండనీ.. దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు వైసీపీ ఖాతాలో లేరు. మిగిలిన 140 మందిలో 60 మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో అసంతృప్తి ఉంది. ఇక మిగిలింది 80 మంది మాత్రమే. అందుకే వైసీపీ ఇప్పుడు 60 మంది పనితీరు సరిగా లేని ఎమ్మల్యేలలో 40 మందిని అనివార్యంగా మార్చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. అదే జరిగితే ఈసారి సీనియర్లు, మాజీ మంత్రులలో కొందరికి టికెట్లు దక్కని పరిస్థితి ఉంది. కాకపోతే వీరిలో ఎంతమంది రెబల్స్ గా మారి పార్టీకి నష్టం చేస్తారనే దానిపైనే వైసీపీ అధిష్టానం లెక్కలేసుకుంటోందని చెబుతున్నారు. అన్నట్లు ఈ నెలాఖరు లోపు ఈ సర్వే ఆధారంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో మరో సారి సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.

By
en-us Political News

  
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.