రేవంత్ పాదయాత్రలో సీనియర్లేరీ?

Publish Date:Feb 9, 2023

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు జనం ఆదరణ కనిపిస్తోంది. రోజు రోజుకూ ఆ ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ జనాదరణ వచ్చే ఎన్నికలలో ఓట్లుగా మారుతుందా? అంటే మాత్రం సానుకూల సమాధానం రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆయన పాదయాత్రలో కాగడా పెట్టి వెతికినా పార్టీ సీనియర్లు ఎవరూ కనిపించకపోవడమే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సహా సీనియర్లందరూ రేవంత్ పాదయాత్రకు దూరంగా ఉంటున్నారు.

యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ నేతలు  విమర్శలతో ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తుంటే.. పార్టీ సీనియర్లెవరూ ఆయనకు మద్దతుగా గళం విప్పడం లేదు. రేవంత్ రెడ్డి- పార్టీ సీనియర్ల మధ్య అగాధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఠాక్రే వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా చెబుతున్నా.. విభేదాలు సమసిపోలేదనీ, అగాధం అలాగే ఉందనీ పరిశీలకులు అంటున్నారు.

అందుకు ఉదాహరణగా రేవంత్ పాదయాత్రనే చూపుతున్నారు. కనీసం పార్టీ కోసమైనా రేవంత్ పాదయాత్ర ప్రారంభం రోజున ఆయనతో అడుగు కలపడానికి కూడా సీనియర్లెవరూ రాలేదు. పీసీసీ సారథ్య బాధ్యతలు రేవంత్ చేపట్టిన నాటి నుంచీ కూడా రేవంత్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్నది ఒంటరి పోరాటమే. ఎంత ఒంటరి పోరు సాగించినా.. సీనియర్ల సహాయ నిరాకరణతో ఆయన పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి ఎలా తీసుకురాగలుగుతారన్న సందేహం రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య ప్రజలలోనూ కలుగుతోంది.

ఆ కారణంగానే ఆయన యాత్రకు ఆదరణ లభిస్తున్నా.. అది ఎన్నికల విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం ఔననే జవాబు రావడం లేదని పరిశీలకులు సైతం చెబుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో అధికార భారాసా పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమష్టిగా పని చేయడమే కాదు.. జాతీయ నాయకత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తోంది. బండి సంజయ్ రాష్ట్రంలో విడతల వారీగా చేసిన పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకులు సంపూర్ణంగా సహకారం అందిస్తే.. అన్ని విడతల ప్రారంభ, ముగింపు సభలకు పార్టీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా వంటి నాయకులు వచ్చి మద్దతు తెలిపారు. అటువంటి సహకారం రేవంత్ రెడ్డికి ఇక్కడి రాష్ట్ర నాయకుల నుంచీ, అటు పార్టీ హైకమాండ్ నుంచీ కూడా కరవైంది. 

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.