జగన్ ది దృతరాష్ట్ర పాలన.. ఏపీలో దుశ్సాసన పర్వం

Publish Date:May 10, 2022

Advertisement

ఏపీలో మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు. మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, హత్యలు నిత్య కృత్యమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలనలో ఏపీలో కీచకపర్వం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఆర్భాటంగా చెప్పుకున్న దిశ చట్టం, ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్, ఆడంబరంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయంటే ఉన్నాయనుకోవడానికే తప్ప మహిళల రక్షణ విషయంలో అవి చేస్తున్న పని శూన్యం.

ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే.. కీచకులు, దుశ్సాసనులు వీరవిహారం చేస్తున్నారు. ఏపీలో మహిళలు భద్రతా, రక్షణా కరవై దినదిన గండంలా బతుకీడుస్తున్నారు. జగన్ ఏలుబడిలో ఏపీ అరాచకత్వానికి చిరునామాగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఒక దాని వెంట ఒకటిగా మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నా ప్రభుత్వం  మాత్రం వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. పైపైచ్చు అత్యాచార ఘటనలపై నిరసనలు వ్యక్తం చేస్తే రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ మంత్రులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసే విషయంలో ఏ మాత్రం చొరవ చూపని పోలీసులు.. విపక్షాల ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంలో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక దాని వెంట ఒకటిగా మహిళలపై దారుణాలు జరుగుతుంటే... జగన్ మాత్రం దృతరాష్టుడిలా రాష్ట్ర పాలన సాగిస్తున్నారు. 
 
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిత అత్యాచార ఘటన మరువక ముందే, తెనాలి రైల్వే స్టేషన్ లో మరో సామూహిక అత్యాచార ఘటన. దాని వెంట మరొకటి..మరొకటి ఇలా ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై మ్లేచ కాముకుల దాడి జరుగుతూనే ఉంది. పలు సంఘటనల్లో మంత్రులు, పోలీసులు నిందితులను వెనకేసుకొస్తూ.. అత్యాచారాల నిరోధానికి బదులు నిందితుల రక్షణకే తమ ప్రాధాన్యత అని రుజువు చేసుకున్నారు.   తెనాలి ఘటనలో సాక్షాత్తూ హోంమంత్రి నేరస్తులను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడారు. 
మహిళా హోంమంత్రి అయ్యుండీ.. దొంగతనం కోసం వచ్చిన వాళ్లు అనుకోకుండా తోపులాట జరిగి అత్యాచారం చేశారని చెప్పడం ప్రభుత్వానికి మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై చర్యలు తీసుకునే ఉద్దేశమే లేదా అన్న అనుమానాన్ని కలిగించేలా ఉన్నాయి. మరో సంఘటనలో హత్యాచారానికి గురైన మహిళది ఆత్మహత్య అని చెప్పడానికి సదరు ఎస్పీ పడిన తాపత్రేయం దిగ్భ్రమ కలిగించక మానదు. మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం నివేదిక రాకున్నా..అత్యాచారం జరగలేదనీ, ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందనీ మీడియాకు చెప్పడం.. నిందితులను కాపాడటానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని విమర్శలు వెల్లువెత్తాయి. 
మొత్తానికి ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలిగేలా పరిస్థితులు దిగజారిపోయాయి. ఏపీలో మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు. మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, హత్యలు నిత్య కృత్యమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలనలో ఏపీలో కీచకపర్వం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఆర్భాటంగా చెప్పుకున్న దిశ చట్టం, ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్, ఆడంబరంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయంటే ఉన్నాయనుకోవడానికే తప్ప మహిళల రక్షణ విషయంలో అవి చేస్తున్న పని శూన్యం. ప్రభుత్వం ఉందా అని అనుమానం కలిగేలా జగన్ సర్కార్ తీరు ఉంది.  తాజాగా పుట్టపర్తి జిల్లాలో పచ్చి బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ తరువాత హత్య చేశారు. ఇలా వరుస సంఘటనలతో ఏపీ రేపుల రాష్ట్రంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చకుంది. దేశంలోనే మహిళలకు రక్షణ లేని రాష్ట్రంగా నిలిచింది. 

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.