ఏపీలో నోరూల్.. ఓన్లీ అరెస్టులు, వేధింపులు!

Publish Date:Sep 29, 2023

Advertisement

ఏపీలో పాలన ఉందా అంటే ఉంది. మరి ఎక్కడా అంటే గాలి మాదిరి అది రాష్ట్ర ప్రజల కంటికి కనిపించదు. నాలుగేళ్ళ పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు.. ఆ నిర్ణయాల వలన లబ్ది పొందిన ప్రజల గురించి గట్టిగా రెండు నిమిషాలు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. క్యాబినెట్ నిర్ణయాలపై కానీ, అసెంబ్లీ వేదికగా కానీ ప్రజలకు ఆయన ఏం చేయాలనుకున్నారో చెప్పింది చూడలేదు.

మైకు దొరికితే టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు, గత ప్రభుత్వం అంతా అవినీతే అంటూ ఆరోపణలు. అమరావతి భూమి కుంభకోణం నుండి ప్రతి అంశంలో అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఒక్కటీ నిరూపించలేకపోయారు. ప్రస్తుతం చంద్రబాబును అరెస్ట్ చేయించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఆరోపిస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ప్రాజెక్టులలో ఆరోపణలపై కూడా ఇప్పటి వరకూ ఒక్క ఆధారం బయటపెట్టింది లేదు. మొన్నటి వరకూ ఆరోపణలతో పబ్బం గడిపిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులతో రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తుంది.

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్టు, లోకేష్ అరెస్టు ఊహాగానాలపైనే చర్చ సాగుతున్నది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? కేసు కొట్టేస్తారా.. విచారణకు ఆదేశిస్తారా? లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారా? ముందే లోకేష్ కు బెయిల్ దక్కుతుందా? ఈ ఇద్దరితో ఈ అరెస్టుల పరంపర ఆగుతుందా? ఒకవేళ చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేస్తే టీడీపీను నడిపించేదెవరు? ఇలా పలు రకాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు అందుతున్నాయా? రబీ సీజన్ మొదలైనా రైతులకు విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు జమవుతున్నాయా? ఆరోగ్య శ్రీ అసలు నడుస్తున్నదా? ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయా.. ఇలా ప్రజల సమస్యలపై ఎక్కడా ఎలాంటి చర్చలు లేవు.. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం లేదు.

 రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో  జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉండడం లేదని, వైద్య పరీక్షలకు కూడా బయటకి పంపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడిక్కడ జిల్లా వార్తాపత్రికల జిల్లా ఎడిషన్ లలో కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలలో ఒక్క బస్తా కూడా ఎరువు దొరకడం లేదు. బయట వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు.

ఇంకా మాట్లాడితే అసలు ఏ శాఖకి మంత్రి ఎవరో కూడా 99 శాతం మంది ప్రజలకు తెలియనే తెలియదు. అసలు ఆయా శాఖల మంత్రులకు కూడా వారి శాఖ ఏమిటో, వారి బాధ్యత ఏమిటో తెలుసా అంటూ అనుమానమేనన్న సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. అసలు ఆ మంత్రులంతా ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పరు. చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులపై మాట్లాడేందుకు మాత్రం అందరూ కట్టగట్టుకొని వరసబెట్టి టీవీల ముందుకు వచ్చేస్తారు.

సహజంగా సీఎం వారం రోజులు రాష్ట్రంలో లేరంటే వచ్చీ రాగానే పాలనపై దృష్టి పెడతారు. గత వారంలో రాష్ట్ర పాలన ఎలా సాగింది? ప్రసుత రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? అసలే అప్పుల పాలు చేసిన రాష్ట్రం కనుక ఏదైనా రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పనులు చేయాలంటే ముందున్న అవకాశాలేంటి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, జగన్ విదేశీ యాత్ర  ముగించుకొని వచ్చిన తర్వాత ఈ తరహా సమావేశాలు చేపట్టినట్లు ఎక్కడా కనిపించలేదు. కనీసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశించినట్లుగా కూడా దాఖలాలు లేవు. కానీ, జగన్ రాష్ట్రానికి వచ్చాక చంద్రబాబు అరెస్టుపై వివరణ ఇవ్వడం, రానున్న ఎన్నికల కోసం ప్రజలను మెప్పించడం ఎలా అనే అంశాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి ఇంచార్జిలు, కన్వీనర్లతో సమావేశాలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే వైసీపీకి రాష్ట్ర పాలన, ప్రజల సంక్షేమం కంటే ప్రత్యర్థులపై కక్షసాధింపు, రానున్న ఎన్నికల కోసం ప్రజలను ఎలా మాయ చేయాలనే దానిపైనే ఆసక్తి కనబడుతుంది.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.