Publish Date:May 27, 2022
వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట చేస్తున్న బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. గడపకూ మన ప్రభుత్వం అంటూ జనం వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడప గడపలోనూ నిరసనలు ఎదురైతే ఇప్పుడు సామాజిక న్యాయ భేరి అంటూ 17 మంది చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు.
విజయ నగరంలో జనం లేకపోవడంతో వర్షం నెపం చెప్పి అర్థంతరంగా సభను రద్ధు చేసుకున్న మంత్రులకు రాజమండ్రిలో జనం లేకపోవడంతో మళ్లీ నిరాస తప్ప లేదు. 17 మంది మంత్రులు ప్రభుత్వం పదవులు, సంక్షేమంలో సామాజిక న్యాయం పాటిస్తోందని చెప్పుకోవడానికి వచ్చే సరికే రాజమంహేంద్రవరంలో సగానికి పైగా జనం వెళ్లిపోయారు. మంత్రులు వచ్చాకా కూడా జనం వెళ్లిపోతుంటే పాపం పోలీసులు వాళ్లని ఆపడానికి శతధా ప్రయత్నించారు.
సభా ప్రాంగణం గేట్లు వేసి ఆపాలని చూశారు. అయినా జనం ఆగలేదు. వాళ్లను తోసుకుంటూ వెళ్లిపోయారు. మంత్రులు చివరకు ఖాళీ కుర్చీలకు తాము చెప్పాల్సింది చెప్పుకొని అక్కడినుంచి కదిలారు. పథకాలు ఆపేస్తామని డ్వాక్రా మహిళలను, ఉపాధి పనులు నిలిపివేస్తామని కూలీలను బెదిరించి మంత్రుల బస్సు యాత్ర సభకు తీసుకు వచ్చారు. వారు కూడా చివరకు మంత్రులు వచ్చే సమయానికి వెళ్లిపోయారు. కాగా మంత్రుల బస్సు యాత్ర సభను స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం ప్రైవేటు బస్సులలో వేల మందిని బలవంతంగా తీసుకు వచ్చినా వారు మంత్రుల ప్రసంగాలను వినడానికి ఇష్టపడలేదు. మంత్రులు వచ్చే సరికే వారు సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు గేట్టు మూసేసి ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక మంత్రుల బస్సు యాత్ర పేరు చెప్పి రాజమహేంద్రవరంలో పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ఆంక్షలపై ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అంతకు ముందు విశాఖపట్నంలో మంత్రుల బస్సు యాత్రు సభకు డ్వాక్రా మహిళలే ప్రేక్షకులు. విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల బస్సు చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం రెండుగంటల నుంచే వివిధ బస్సులలో తీసుకొచ్చి మహిళలు, వృద్ధులను కూర్చోపెట్టారు. కానీ 6 గంటలైనా మంత్రుల బస్సు రాకపోవడంతో జనం తిరుగుముఖం పట్టారు. సుమారు రాత్రి 7 గంటలకు మంత్రుల బస్సు వచ్చింది. అప్పటికే సగం జనం వెళ్లిపోయారు.
జనాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతారని పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. రాజమహేంద్రవరం సభ జన సమీకరణకు మండలానికి 15 ప్రైవేట్ బస్సుల వరకూ ఏర్పాటు చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-response-for-ministers-nus-yatra-39-136553.html
ఇప్పటి జనరేషన్ కు ఫఓన్ అంటే మొబైల్ అని మాత్రమే తెలుసు. 1980కి ముందు ప్రపంచాన్ని చూసిన వారికి ఫఓన్ అనే పరికరం మాత్రమే తెలుసు.
వారం రోజులు ఆలస్యం అయితే అయ్యింది కానీ ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.
వైసీపీ అధినేత జగన్ పార్టీ క్యాడర్ నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమయ్యారా? అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ప్రజావ్యతిరేకత వెనుక పార్టీ అధినాయకుడు క్యాడర్ విశ్వాసం కోల్పోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి తల్లి విజయమ్మ బుధవారం (జూన్ 7) అమరావతిలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఇచ్చినా.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అలా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కొట్టేసి.. వరుస ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్నారు
వివాదాలు సృష్టించి సినిమా సక్సెస్ కు బాటలు వేసుకోవడమన్నది కొత్త విషయమేమీ కాదు. ఈ విషయంలో ఆర్జీవీగా పిలవబడే రామగోపాల్ వర్మ అందరి కంటే రెండాకులు ఎక్కువే చదివాడని అంతా అనుకుంటారు.
విశ్వాసం పట్టుదల కలగలిసి సాగుతున్న నారాలోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాలనూ చుట్టేసింది. మరో మూడు నాలుగు రోజులలో సీమలో లోకేష్ పాదయాత్ర పూర్తి అవుతుంది.
మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు. బాహుబలి సినిమాలో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు దాదాపుగా ఇలాంటి డైలాగ్ నే నినాదంగా మార్చుకున్నారు. తెలంగాణా ఊపిరి పీల్చుకో.. సోనియమ్మ బిడ్డ వస్తోంది. ప్రియాంక గాంధీ వస్తోంది అంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. సంబురాలు చేసుకుంటోంది. మరి అవశేష అందర ప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టుకుంది.
నిండా మునిగిన వాడికి చలేమిటంటారు. అయితే ఈ నానుడి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి వర్తిస్తున్నట్లు లేదు. అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత వెల్లువెత్తుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఎన్నికల భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బుధవారం (జూన్ 7) జరిగిన కేబినెట్ భేటీలో ఆయన మాటల్లో ఈ విషయం తేటతెల్లమైంది.
తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. బుధవారం (జూన్ 7) తిరుమల శ్రీవారిని 75వేల 229 మంది భక్తుల దర్శించుకున్నారు.
ఆయన ఏమన్నారు? ఇలా ప్రమాణ స్వీకారం చేయడం, అలా ఫైవ్ గ్యారెంటీలకు పచ్చ జెండా ఊపడం, అని కదా, అన్నారు. అవును, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము.