Publish Date:Mar 27, 2025
వైసీపీ నాయకురాలు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినికి హైకోర్టులో ఊరట లభించలేదు. అవినీతి కేసులో విడదల రజని దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై గురువారం (మార్చి 27) విచరణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. బెయిలుపై కనీసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విడదల రజని విజ్ణప్తిని తోసిపుచ్చింది.
మాజీ మంత్రి విడదల రజని, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరో ఇద్దరిపై ఏసీబీ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో మంత్రి హోదాలో విడదల రజిని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా విడదల రజిని, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారిగా పని చేసిన పల్లె జాషువా, రజిని సమీప బంధువు విడదల గోపి, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణులు సహ నిందితులుగా ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-respite-to-vidadala-rajani-in-high-court-25-195100.html
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.