దళిత ప్రజాప్రతినిథులకు గౌరవం ఇవ్వరా?

Publish Date:Sep 5, 2024

Advertisement

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. దళిత ప్రజాప్రతినిధులకు అధికారులు గౌరవం ఇవ్వరా అన్న చర్చకు తెరలేపాయి. ఇంతకూ జరిగిందేమిటంటే.. వరదముంపు ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హెలిప్యాడ్ వద్ద స్వాగతం తెలిపేందుకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెళ్లారు. మంత్రులకు స్వాగతం పలికేందుకు అనుమతి ఉన్న ఆరుగురిలో వేముల వీరేశం కూడా ఒకరు. అయితే పోలీసులు వేముల వీరేశాన్ని అడ్డుకున్నారు. అసలు వేముల వీరేశంను వారు గుర్తు పట్టలేదు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వేముల వీరేశం.. తోటి నాయకులు సముదాయించినా వినకుండా పోలీసులకు కామన్ సెన్స్ లేదంటూ వెనక్కు వెళ్లిపోయారు. వేముల వీరేశం ను పోలీసులు అడ్డకోవడం నాయకులనే కాదు, ప్రజలను కూడా నివ్వెర పరిచింది. కాగా పోలీసు అధికారులు తన పట్ల వ్యవహరించిన తీరుపై వైముల వీరేశం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను కలిసి  ప్రివేలేజ్ మోషన్ ఇచ్చారు.  
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి పర్యటన సందర్బంగా వారికి స్వాగతం తెలిపేందుకు హెలిప్యాడ్ దగ్గరికి ముందుగా పేర్లు నమోదైన ఆరుగురిలో ఉన్న ఎమ్మెల్యేగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా వెళ్లారు...అయితే అక్కడ పోలీసులు అధికారులు వీరేశంను గుర్తుపట్టకపోగా అడ్డుకునే ప్రయత్నం చేశారు...ఈ సంఘటన ప్రజాప్రతినిధులతో పాటూ... సామాన్య ప్రజలను కూడా నివ్వెరపోయేలా చేసింది. దీంతో పోలీసులపై మనస్తాపం చెందిన ఎమ్మెల్యే వీరేశం తోటి నాయకులు  సముదాయించినా వినకుండా పోలీసులకు కామన్ సెన్స్ లేదా అంటూ వెనక్కు వెళ్లిపోయారు. ఆర్టికల్ 19, 21,194 ప్రకారం... ఎమ్మెల్యే విధులు ఆటంకపరిచి , హక్కులు హరించినందుకు... అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తనకు జరిగిన అవమానం మరే ఎమ్మెల్యేకూ జరగకూడదన్న ఉద్దేశంతోనే స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు వేముల వీరేశం తెలిపారు. ఇదంతా పక్కన పెడితే వేముల వీరేశంపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దళిత ప్రజాప్రతినిథులపై వ్యవహరించే తీరు అవమానకరంగా ఉంటుందనీ, వేముల వీరేశం పట్ల పోలీసుల అనుచితంగా ప్రవర్తించడం వెనుక సుధీర్ బాబు ఆదేశాలు ఉండి ఉంటాయనీ ప్రజా ప్రతినిథులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ కూడా దళితుల పట్ల సుధీర్ బాబు ప్రవర్తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా ఆయన కొందరు అధికారులు దళిత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిథుల పట్ల చాలా చులకనభావంతో వ్యవహరిస్తున్నారనీ, తమ ఫోన్లను ఆన్సర్ చేయరనీ, నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో తమ సూచనలను ఖాతరు చేయరనీ సత్యనారాయణ ఆరోపించారు. అసలు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దళిత ప్రజాప్రతినిథులతో అనుచితంగా, అగౌరవంతో వ్యవహరిస్తారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా వేముల వీరేశం విషయంలో అవమానకరంగా వ్యవహరించినది కింది స్థాయి పోలీసు అధికారులే అయినా వారికి డ్యూటీలు వేసి, ప్రొటోకాల్ ఆదేశాలు ఇచ్చేది కమిషనరేననీ, ఆయన ఆదేశాల మేరకే వేముల వీరేశంకు ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానించారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేముల వీరేశం కూడా స్వయంగా అవే ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అవమానానికి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబే బాధ్యత వహించాలని మీడియా ముఖంగా చెప్పారు. 

జిల్లాలో ఒకరిద్దరు బడా నేతల కనుసన్నలలో  ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్లో వీరేశంను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతున్నదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.  ఎమ్మెల్యే అయితే మాకేంటీ అన్నట్లుగా కొందరు అధికారులు ఒకరిద్దరు నేతల తీరు ఉందని స్వయంగా వీరేశం వాపోతున్నారు.  అయితే ఆ బడానెతలెవరు, కాంగ్రెస్ వారా, వేరే పార్టీకి చెందిన వారా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  వీరేశం   తన మాట తీరుతో, డైనమిక్ నిర్ణయాలు,   ప్రజాసేవ ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ కారణంగానే ప్రజలలో ఆయన పలుకుబడిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.  మరోవైపు ఎమ్మెల్యేల నుండి ఫిర్యాదు అందుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయినా చర్యలకు ఉపక్రమిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.