చికిత్స పేరుతో జయను చంపేశారా? సెన్సేషనల్ ఆడియోల లీక్

Publish Date:Oct 20, 2022

Advertisement

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనక మిస్టరీ ఉందనడానికి ఒకదాని తరువాత ఒకటిగా ఆధారాలు బయటపడుతున్నాయి. అనారోగ్యానికి గురైన జయలలితను ఆసుపత్రిలో చేర్పించి ఆక్కడ ఆమెకు సరైన చికిత్స అందకుండా చేశారనీ, చివరకు మరణించే వరకూ ఆమెను ఆసుపత్రిలోనే బందీగా ఉంచారనీ  అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఆమె మృతి వెనుక ఏదైనా మిస్టరీ ఉన్నదా అన్న విషయాన్ని తేల్చడానికి నియమించిన కమిషన్ ఇటీవలే తన నివేదికను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అందజేసింది. ఆ కమిషన్ నివేదిక కూడా జయలలిత మరణం వెనుక మిస్టరీ ఉందనీ.. దానిని ఛేదించేందుకు దర్యాప్తు అవసరమనీ పేర్కొంది. తాజాగా లీక్ అయిన రెండు ఆడియో క్లిప్పింగులు కూడా జయలలిత మరణానికి కేవలం అనారోగ్యం ఒక్కటే కారణం కాదన్న అనుమానాలను బలపరుస్తున్నాయి.

ఆసుపత్రిలో ఆమెకు సరైన చికిత్స అందడం లేదని స్వయంగా జయలలిత అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆడియో ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతున్నాది. జయలలిత ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న సమయంలో మాట్లాడినట్లుగా చెప్తున్న కొన్ని మాటలు లీక్ కావడం సంచలనం రేపుతోంది.   ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత తన గదిలో ఉన్న డాక్టర్లపై అసహనం వ్యక్తం చేయడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నది.

తాను పిలిస్తే ఎందుకు రావడం లేదని డాక్టర్లపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆమె దగ్గుతూ ఉండటం, అలాగే ఆమె గొంతు చాలా బలహీనంగా ఉండటం ఆ ఆడీయోలో స్పష్టంగా తెలుస్తోంది.  తాను బాధపడుతున్నా  పట్టించుకోవడం లేదంటూ  జయలలిత అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి.  

అలాగే మరో ఆడియోలో  జయలలితను విదేశాలకు పంపి చికిత్స అందించడం అంత అవసరమా అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళ అంటుండటం స్పష్టంగా వినిపిస్తోంది.   2017లో జయలలిత చికిత్సకు సంబంధించి వివరాలు అందించేందుకు లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బేలే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా మీట్ తరువాత అనంతరం ఆయన అక్కడే ఉన్న  శికళతో మాట్లాడిన సంభాషణకు సంబంధించిన ఆడియోలో డాక్టర్ బేలే   జయలలిత అప్పటి ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తుంటే.

 శశికళ జయలలితను విదేశాలకు పంపడం అవసరమా అని ప్రశ్నించడం, ఆమె ప్రశ్నకు డాక్టర్ బేలే జయలలితను చికిత్స కోసం విదేశాలకు పంపాల్సిందే అని, ఇందుకు జయలలిత కూడా అంగీకరించారని చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది.  ఈ రెండు వీడియోలనూ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఎవరో రికార్డు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ రెండు వీడియోలు ఇప్పుడు తమిళనాటసంచలనం సృష్టిస్తున్నాయి.  

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.