విభజన సమస్యల పరిష్కారం.. పురోగతి పూజ్యం.. నామ్ కే వాస్తేగా సమావేశాలు!

Publish Date:Sep 27, 2022

Advertisement

ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు, అపరిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎడతెగకుండా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. విభజన సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాలలో పురోగతి నత్తనడకను తలపిస్తోంది.

తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశా కీలక సమావేశం నిర్వహించింది. మంగళవారం (సెప్టెంబర్ 27)  జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్ లు సోమేష్ కుమార్, సమీర్ శర్మ ల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల నుంచీ ప్రతినిథి బృందాలు హాజరయ్యాయి.  ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశం కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్‌ భ‌ల్లా నేతృత్వంలో జరిగంది. ఈ సమావేశంలో చర్చకు రూపొందించిన అజెండాలో 14 అంశాలను పొందుపరచగా వాటిలో పలు అంశాలు అసలు చర్చకే నోచుకోలేదని తెలియవచ్చింది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్యా తరచూ వివాదానికి కారణమౌతున్న విద్యుత్ బకాయిల అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకే నోచుకోలేదని అధికార వర్గాల ద్వారా తెలిపింది.

అంతే కాక చర్చ జరిగిన అంశాలలో కూడా ఇరు రాష్ట్రాల మధ్యా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం నిష్ఫలంగానే ముగిసిందని ఆ వర్గాలు తెలిపాయి. అంటే ఈ సమావేశం కూడా గత సమావేశాల లాగే ఏ సమస్యకూ పరిష్కారం చూపకుండానే ముగిసింది. తెలుగు రాష్ట్రాల సీఎస్ లు, వారి బృందాలూ కూడా తమ వాదనలకే కట్టుబడి ఉండటం, ఎదుటి వారి వాదనను వినే పాటి ఓపిక, ఆసక్తి కనబరచకపోవడంతో సమావేశం ఏ ప్రయోజనం లేకుండానే, ఏ పరిష్కారం కనుగొనకుండానే ముగిసిందని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతే కాకుండా మరో మారు సమావేశం అయ్యే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కూడా ఎటువంటి స్పష్టతా లేదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.సమావేశంలో చర్చకు వచ్చిన ఏ అంశంపైనా కూడా ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర అంగీకారం కుదరలేదు.  ఇక ఈ సమావేశంలో ఏపీ రాజధాని నిర్మాణం కోసం నిధులు కావాలని కోరగా ఇప్పటికే విడుదల చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పిన తరువాతనే ఏపీ వినతిని పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.  

మొత్తం మీద విభజన సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతీ లేకుండానే కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలు ముగుస్తుండటం పట్ల ఇరు రాష్ట్రాలలోనూ అసంతృప్తి వ్యక్తమౌతున్నది. విభజన చట్టంలో స్పష్టంగా ప్రస్తావించిన అంశాలను కూడా అమలు చేయలేకపోవడం కేంద్రం నిర్లక్ష్య వైఖరికీ, ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ చిత్తశుద్ధి లేమికీ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.