తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వేలలో కచ్చితత్వం ఉందా?

Publish Date:Oct 25, 2023

Advertisement

తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న పార్టీలు, ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్ధులను ప్రకటించలేదు. అధికార బీఆర్‌ఎస్ కూడా ఇంకా పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  అభ్యర్ధుల తొలి జాబితాను మాత్రమే ప్రకటించాయి.  అన్నిటికీ  మించి ఈ సారి ఎన్నికలలో కింగ్ మేకర్ పాత్ర, అంత కంటే ఎక్కువ అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా పోటీ విషయంలోనే స్పష్టత ఇవ్వలేదు. తెలుగుదేశం  ఈ సారి పోటీ విషయంలో సారీ చెప్పేస్తుందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో వస్తున్నాయి.

ఇక తాను ఎన్డీయే భాగస్వామినే అని చెబుతున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో ఇప్పటికే 36 స్థానాలలో పోటీకి రెడీ అని ప్రకటించేశారు. బీజేపీ అయితే జనసేనను మద్దతుకే పరిమితం కావాలి..పోటీ వద్దు అని కోరుతోంది. దీనిపై జనసేనాని ఏ నిర్ణయం తీసుకున్నారో.. తీసుకుంటారో అన్న విషయంలో క్లారిటీ లేదు. మరో వైపు ఏపీలో మాత్రం జనసేనానికి తెలుగుదేశంతో పొత్తు ఖరారు చేసేశారు. సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో ఉమ్మడి సమావేశంలో పాల్గొన్నారు. మరి అదే సయోధ్య, సమన్వయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇరు పార్టీల మధ్యా అంటే తెలుగుదేశం, జనసేన మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  అన్ని పార్టీలలోనూ అసమ్మతి రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జంపింగ్ లు కూడా అన్ని పార్టీలకూ తలనొప్పిగానే ఉన్నాయి. అభ్యర్థులు ఎవరు? రెబల్స్ గా ఎవరు బరిలోకి దిగుతారు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. షర్మిల పార్టీతో పాటు, దళితుల్లో బలం ఉన్న బీఎస్పీ ఇప్పటికే రంగంలో ఉన్నట్లు ప్రకటించాయి. ఆ రెండు పార్టీలకూ సొంతంగా విజయం సాధించే బలం లేకున్నా.. ఏదో మేరకు కనీసం కొన్ని నియోజకవర్గాలలోనైనా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలుగుతాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఇన్ని రోజులైనా.. ఇప్పటి వరకూ పార్టీల అభ్యర్థులు, వారి బలాబలాలు, తెలుగుదుశం, జనసేనల నిర్ణయం ఏమిటి? ఒక వేళ రెండూ పోత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో దిగితే సమీకరణాలు ఎలా ఉంటాయి? జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే సమీకరణాలు ఎలా మారుతాయి? తెలుగుదేశం ఒంటరిగా బరిలోకి దిగితే పరిస్థితి ఏమిటి? అసలు పోటీలో లేకుండా ఉంటే ఏమౌతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం రాకుండానే.. తెలంగాణలో అధికారం ఈ పార్టీదే.. కాదు కాదు ఆ పార్టీదే అంటూ వెలువడుతున్న సర్వేలకు విశ్వసనీయత ఎమిటి? ఎంత? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేడి అయితే బాగా పెరిగింది కానీ.. ఏయే పార్టీలు అధికారం రేసులో ముందుంటాయి? ఏయే పార్టీలు వెనుకబడతాయి అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడ్ ఆఫ్ ది తెలంగాణ అన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని అంటున్నారు. 

గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ, ఈ సారి అధికారం మాదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలకు కూడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ మీడియా సంస్థలు, స్థానిక సంస్థలు వెలువరిస్తున్న సర్వేలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని నమ్మడం కష్టమేనని చెబుతున్నారు.  పార్టీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే.. రాష్ట్రంలో పొత్తుపొడుపులపై చర్చలు ఇంకా సాగుతుండగానే వెలువడిన సర్వేల ఫలితాలను ఎలా విశ్వసించగలమని రాజకీయవర్గాలు అంటున్నాయి.  

తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ అధికారం చే జిక్కించుకోవడం తథ్యమని జాతీయ మీడియా సంస్థలు చెబుతుంటే.. బీజేపీ అనుకూల మీడియా మాత్రం హంగ్ తథ్యమని జోస్యం చెబుతోంది.  లోక్‌పోల్  సర్వే బీఆర్‌ఎస్‌కు 45-51 సీట్లు కాంగ్రెస్‌కు 61-67 సీట్లు వస్తాయని పేర్కొంటే.. పోల్  బీఆర్‌ఎస్‌కు 40-కాంగ్రెస్‌కు 64 సీట్లు, తెలంగాణ పల్స్ బీఆర్‌ఎస్‌కు 46-54, జన్‌మత్ సంస్థ బీఆర్‌ఎస్ 45-47, కాంగ్రెస్ 58-60; ఏబీపీ-సీ ఓటర్ సంస్థ బీఆర్‌ఎస్ 43-55, కాంగ్రెస్‌కు 54 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. ఈ సర్వేలను పరిశీలిస్తే.. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ బలంగా పుంజుకుందన్నది మాత్రం స్పష్టమౌతున్నది. అలాగే ఇంత కాలం బీజేపీ బలంగా చూపుకున్నది కేవలం వాపు మాత్రమేనని తేటతెల్లమౌతున్నది. తెలుగుదేశం పోటీపై స్పష్టత వచ్చిన తరువాత, అలాగే జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగుతాయా అని తేలిన తరువాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలలో గణనీయమైన మార్పు రావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు వెలువడిన సర్వేలలో కచ్చతత్వం ఉందని భావించడం సరి కాదని అంటున్నారు. 

By
en-us Political News

  
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.