Publish Date:Aug 11, 2022
అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి.. అంటూ చెల్లెలు అన్నగారి కాళ్ల మీద పడి కన్నీళ్లతో కడిగినపుడు ప్రేక్షకులు అన్నగారినే మెచ్చుకున్నారు. సినిమాలో చెల్లెలు నిజంగానే వీర ప్రేమ ప్రకటించింది గనుక. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ తరిగిపోతుందా అంటే అసాధ్యమంటారు పెద్దవాళ్లు.. కానీ ఇప్పుడు అవసరార్ధం ప్రేమనే ప్రకటించారు వైసీపీ చెల్లెళ్లంతా!
Publish Date:Aug 11, 2022
తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రచారంపై అభ్యంతరం తెలిపింది.
Publish Date:Aug 11, 2022
సరిగ్గా ఆజాదీ కా అమృతోత్సవ్ సమయంలోనే విపరీతంగా ప్రచారం చేస్తోంది మోడీ ప్రభుత్వం
Publish Date:Aug 11, 2022
వైసీపీ ఎంపీ న్యూడ్ కాల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు అందింది.
Publish Date:Aug 11, 2022
తాజాగా హార్వర్డ్ వర్సి టీలో ఇద్దరు తమ స్నేహం గురించి తెలియ జేశారు. ఒకరు భారత్కి చెందిన అమ్మాయి, మరొకరు పాకి స్తాన్! వీరిద్దరూ చాలాకాలం తర్వాత కలిసేరు. కానీ అంతే స్నేహపూర్వకంగా, మరెంతో అభిమానంతో మాట్లాడుకున్నారు. తాను ఇన్నాళ్లకు పాక్ స్నేహితురాలిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని స్నేహా ప్రకటించింది.
Publish Date:Aug 11, 2022
ఒకరి గొప్పతనాన్ని ఓర్వలేని తనంతో తిరస్కరించడం,ఒకరి దార్శనికత జాతికి మేలు చేస్తుందని తెలిసినా నిర్లక్ష్యం చేయడమో అమలు కాకుండా అటకెక్కించడం క్షమార్హం కాదు. క్షంతవ్యం కాదు. జగన్ సర్కార్ సరిగ్గా అలా క్షంతవ్యంకాని వ్యవహార శైలినే ఈ మూడేళ్లుగా చేస్తూ వస్తున్నది. నాడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజధాని నిర్మాణ పను ల కోసం విదేశీయులతో సంప్రదిచడం మీద అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఆయన దూరదృష్టిని గ్రహించి విమర్శకులంతా ఆ తరువాత మెచ్చుకున్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించారు.
Publish Date:Aug 11, 2022
ఎంతటి గొప్పవారినైనా అట్టడుగుకు నెట్టేయడం, ఎంతటి అనామకులైనా అమాంతం అందలం ఎక్కించడంలో డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయానిది అందెవేసిన చేయి. దేశంలో బీజేపీని బతికి బట్టకట్టించేందుకు కాలికి బలపం కట్టుకుని మరీ రథయాత్ర చేసిన ఆ పార్టీ ఒకప్పటి అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీని, ఆ పార్టీ కోసమే తమ సర్వ శక్తియుక్తులను ధార పోసిన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, దివంగత సుష్మా స్వరాజ్ లాంటి వారికి ఈ డబుల్ ఇంజిన్ ఏమాత్రం ప్రాధాన్యం కల్పించలేదనేది జగమెరిగిన సత్యం. వీరి కోవలోకే తాజాగా పదహారణాల మన తెలుగుబిడ్డ, తాజా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వస్తారు.
Publish Date:Aug 11, 2022
తెలంగాణా ప్రభుత్వం కూడా పాటించడానికి కంకణం కట్టుకుంది. కేంద్రం అజాదీ కా అమృ తోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన కేంద్రానికి ధీటుగా తెలంగాణా ప్రభుత్వం కూడా సరికొత్త వ్యూహం అనుసరించి తెలంగాణా ఆకర్ష్ కి మరింత దన్ను ఇచ్చారు.
Publish Date:Aug 11, 2022
లేటెస్టుగా ప్రధాని రక్షాబంధన్ అడ్డంపెట్టుకుని మంగళవారం (ఆగష్టు 10) ఢిల్లీలో ప్రధాని తన కార్యాలయంలో పనిచేస్తున్నపారిశుధ్య కార్మికుల పిల్లల్ని పిలిపించి వారితో రాఖీ కట్టించుకున్నారు.
Publish Date:Aug 11, 2022
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి, వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చరైంది. ఆయితే ఈ ప్రమాదంలో విజయమ్మ సురక్షితంగా బయట పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
Publish Date:Aug 11, 2022
బీహార్ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగిన పీకే.. రాజకీయ నేతగా మాత్రం ఎవరికీ పట్టకుండా పోయారు. ఇప్పుడు ఇటు ఎన్నికల వ్యూహాలూ పారక.. అటు రాజకీయంగానూ గుర్తింపు లేక రెంటికీ చెడ్డ రేవడగా మిగిలిపోయారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువుదీరిన పరిణామాలలో ప్రశాంత్ కిశోర్ ప్రమేయమే లేకుండా పోయింది.
Publish Date:Aug 11, 2022
పది పైసల ఆనందమే అంతుంటే ఏకంగా వజ్రమే దొరికితే! తప్పకుండా ఊళ్లో భూస్వామి నా ముందు బలాదూర్ అనే అను కుంటాడు.
Publish Date:Aug 11, 2022
కాల క్రమంలో, రాజకీయ పరిణా మాలు దారుణంగా మారుతుండడంతో బంగ్లా క్రమేపీ శ్రీలంక లా మారుతుందేమోనన్న భయాం దోళన లు అంతటా ఉన్నాయని విశ్లేషకుల మాట.